Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైం పడుతుందా?
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేసినా ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.

Allu Arjun Trivikram Movie Delay Some More Months
Allu Arjun – Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేసినా ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అదుగో స్టార్ అవుతుంది.. ఇదుగో స్టార్ అవుతుంది అంటూ ఊహాగానాలే కానీ.. ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లింది లేదు.
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూవీస్ బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీస్. ఈ క్రేజీ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ బన్నీ-త్రివిక్రమ్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్లోనే మరో సినిమా వస్తోందని, అది నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉండబోతోందని నిర్మాత నాగవంశీ చెప్పినప్పట్నుంచి ఎప్పుడెప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదని, ఇంకా చాలా టైమ్ పడుతుందని వార్త వైరల్ అవుతోంది.
Also Read : Sreeleela Dance : అక్కడ పనిచేస్తున్న మహిళలతో శ్రీలీల క్యూట్ డ్యాన్స్ చూశారా..? వీడియో వైరల్..
బన్నీ కెరీర్ లో పెద్ద బ్రేక్ లేకుండానే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ త్రివిక్రమ్ అలా కాదు కెరీర్ స్టార్ట్ చేసిన 23 ఏళ్లలో 12 సినిమాలు మాత్రమే చేశారు. అంటే కనీసం సినిమాకి రెండేళ్ల గ్యాప్ తీసుకుంటున్నారు. 2018లో అరవింద సమేత వీరరాఘవ చేస్తే 2020లో అలవైకుంఠపురంలో మూవీ చేశారు. ఆ సినిమా తర్వాత 4 ఏళ్లకి గుంటూరుకారం సినిమా చేశారు. మరి ఈ లెక్కన నెక్ట్స్ సినిమా చెయ్యాలంటే ఇంకా టైమ్ తీసుకునేలా తెలుస్తోంది.
ఇప్పటికే గుంటూరుకారం సినిమా తర్వాత 15 నెలల నుంచి ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ బన్నీతో స్టార్ట్ చెయ్యాల్సిన సినిమాకి ఇంకా టైమ్ తీసుకుంటున్నట్టు టాక్. ఎందుకంటే బన్నీతో సినిమాకి వరల్డ్ వైడ్ రీచ్ ఉంది. పుష్ప 2 ది రూల్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను రూల్ చేసి 1850 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. అలాంటి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే భారీ అంచనాలు పెట్టుకున్నారు బన్నీ ఫ్యాన్స్.
Also Read : Aamir Khan : మళ్ళీ సౌత్ సినిమాల మీద కుళ్లుకున్న బాలీవుడ్ రైటర్.. కౌంటర్ ఇచ్చిన ఆమీర్ ఖాన్..
అలాంటిదే త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా. ఇది సెట్స్ మీదకు వెళ్లాలంటే ఇంకా 6 నెలలు టైం పడుతుందని ఫిల్మ్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. బన్నీ ఇప్పటివరకు టచ్ చేయని మైథలాజికల్ జోనర్ అవ్వడం, అందుకు సంబంధించిన గ్రాండియర్ సెట్స్, గ్రాఫిక్స్, టెక్నిషియన్స్ సెలక్షన్ ప్రాసస్… వీటన్నిటికి మించి బన్నీ మేకోవర్ వీటి కోసం టైం పట్టనుంది. పాన్ ఇండియా మూవీగా 500 కోట్లకి మించి తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ లో నటించే స్టార్ కాస్ట్ ను సైతం ఫైనల్ చేయాల్సి ఉంది. ఇన్ని పనులు బ్యాలెన్స్ లో ఉన్నాయి కాబట్టే ఈ ప్రాజెక్ట్ కి టైమ్ పడుతుందని, లేట్ అయినా సరే నెక్ట్స్ లెవల్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
అయితే త్రివిక్రమ్ సినిమా మొదలయేలోపు బన్నీ అట్లీతో సినిమా చేసి వస్తాడని వార్తలు వస్తున్నాయి కాని దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.