Allu Arjun : ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు ఈరోజే రిలీజ్.. స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ బన్నీ పోస్టు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఈ రోజే రిలీజయ్యాయి. ఆ సినిమాలను గుర్తు చేసుకుంటూ బన్నీ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun : ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు ఈరోజే రిలీజ్.. స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ బన్నీ పోస్టు

Allu Arjun

Updated On : January 12, 2024 / 8:18 PM IST

Allu Arjun : అల్లు అర్జున్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేశ ముదురు’, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలు జనవరి 12 న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ బన్నీ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

Tantra : హారర్ మూవీలో మెలోడీ సాంగ్.. ‘తంత్ర’ నుంచి ‘ధీరే ధీరే’ సాంగ్ విన్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రితో కెరియర్ మొదలుపెట్టి వరుసగా సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో అత్యథిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎదిగిన బన్నీని స్లైలిష్ స్టార్‌గా ఫ్యాన్స్ పిలుచుకుంటారు. గతేడాది పుష్ప: ది రైజ్‌లో నటనకు గాను జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ తను నటించిన దేశ ముదురు, అల వైకుంఠపురములో సినిమాలను గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

బన్నీ నటించిన ‘దేశ ముదురు’ రిలీజై సరిగ్గా 17 సంవత్సరాలు అవుతోంది. 12 జనవరి 2007 లో ఈ సినిమా రిలీజైంది. పూరీ జగన్నాథ్  డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. బన్నీకి జోడిగా హన్సిక నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12, 2020 లో రిలీజై 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఈ రెండు సినిమాలలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. బన్నీ ట్వీట్ వైరల్ అవుతోంది.

Prabhas : ‘సలార్’ సక్సెస్‌తో.. మంగళూరు దగ్గర్లోని ప్రముఖ ఆలయంలో ప్రభాస్..

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 నటిస్తూ బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కాబోతోంది. బన్నీకి జోడిగా రష్మిక నటిస్తున్నారు.