Tantra : హారర్ మూవీలో మెలోడీ సాంగ్.. ‘తంత్ర’ నుంచి ‘ధీరే ధీరే’ సాంగ్ విన్నారా?

ఇప్పటీకే తంత్ర సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులని భయపెట్టారు. తాజాగా ఈ హారర్ సినిమా నుంచి ఓ మెలోడీ లవ్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Tantra : హారర్ మూవీలో మెలోడీ సాంగ్.. ‘తంత్ర’ నుంచి ‘ధీరే ధీరే’ సాంగ్ విన్నారా?

Ananya Nagalla Tantra Movie Dheere Dheere Song Released by Anasuya and Payal Rajput

Updated On : January 12, 2024 / 7:55 PM IST

Tantra Movie Song : వకీల్ సాబ్, మల్లేశం సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న అనన్య నాగళ్ళ(Ananya Nagalla) ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాల్లో కీ రోల్స్, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకెళ్తుంది. అనన్య నాగళ్ళ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న హారర్ సినిమా ‘తంత్ర’. ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవిచైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటీకే తంత్ర సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులని భయపెట్టారు. తాజాగా ఈ హారర్ సినిమా నుంచి ఓ మెలోడీ లవ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నటి అనసూయ తమ సోషల్ మీడియాలో ఈ మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు. తంత్ర సినిమా నుంచి వచ్చిన ఈ ధీరే ధీరే మెలోడీ సాంగ్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

Also Read : Prabhas : ‘సలార్’ సక్సెస్‌తో.. మంగళూరు దగ్గర్లోని ప్రముఖ ఆలయంలో ప్రభాస్..

సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి, నిర్మాతలు మాట్లాడుతూ.. మా తంత్ర సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే సినిమాపై అంచనాలు నెలకొన్నాయని చెప్పారు. త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తాజాగా తంత్ర సినిమా నుంచి ఈ ధీరే ధీరే సాంగ్ ని పాయల్ రాజ్‌పుత్ గారు, అనసూయ గారు రిలీజ్ చేశారు. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో ఎన్నో మంచి పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం సినిమాకు చాలా ప్లస్ అయ్యింది అని అన్నారు.