Allu Arjun : అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..

సినీ న‌టుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఊర‌ట ల‌భించింది.

Allu Arjun : అల్లు అర్జున్‌కు ఊర‌ట‌.. మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు..

Allu Arjun

Updated On : December 13, 2024 / 5:59 PM IST

సినీ న‌టుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టులో కాస్త ఊర‌ట ల‌భించింది. న్యాయ‌స్థానం మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని బ‌న్నీ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. దీనిపై సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి. వాదాన‌లు విన్న న్యాయ‌స్థానం బ‌న్నీకి మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నాం 1.30కి అరెస్టు చేసిన‌ట్లు రిమాండ్ రిపోర్టులో వెల్ల‌డించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజ‌రు ప‌ర‌చ‌గా కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై హైకోర్టులో వాదనలు: ఏపీలో పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట కేసును ప్రస్తావించిన అడ్వకేట్

మరోపక్క హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై వాద‌న‌లు జ‌రిగాయి. క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసం కాదని, సోమవారం వినాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) న్యాయ‌స్థానాన్ని కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు. క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశాని, అందువల్ల ఈ పిటిషన్‌ ద్వారానే మధ్యంతర బెయిల్‌ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అర్ణబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను: వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు