Amithab Bachchan : ప్రాజెక్ట్ K షూటింగ్‌లో గాయంపై అమితాబ్ మరో పోస్ట్.. కంగారుపడుతున్న అభిమానులు..

తాజాగా అమితాబ్ బ్లాగ్ లో రాసిన మ్యాటర్ వైరల్ గా మారింది. తన రోజువారీ బ్లాగ్ లో అనేక విషయాలు రాస్తారు అమితాబ్. నిన్నటి రోజున కూడా పలు విషయాలు రాసి చివర్లో................

Amithab Bachchan : ప్రాజెక్ట్ K షూటింగ్‌లో గాయంపై అమితాబ్ మరో పోస్ట్.. కంగారుపడుతున్న అభిమానులు..

Amithab Bachchan post in his blog about injury happened in Project K

Updated On : March 12, 2023 / 5:45 PM IST

Amithab Bachchan :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది అని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండి ఈ సినిమా. ఇటీవల హైదరాబాద్ లో ప్రాజెక్ట్ K షూటింగ్ జరుగుతున్న సమయంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు.

దీంతో అమితాబ్ ని వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పక్కటెముక కండరాలకు గాయమైనట్లు వైద్యులు గుర్తించి ప్రాథమిక చికిత్స అందించారు. కొన్ని రోజులు అమితాబ్ పూర్తిగా చికిత్స తీసుకోవాలి అని వైద్యులు తెలపడంతో షూటింగ్ ఆపేసి అమితాబ్ ముంబై వెళ్లిపోయారు. ప్రస్తుతం అమితాబ్ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక అమితాబ్ రెగ్యులర్ గా తన బ్లాగ్ లో తన గురించి విశేషాలను పోస్ట్ చేస్తూ ఉంటాడని అందరికి తెలిసిందే. ఈ గాయం జరిగిన రోజు దీని గురించి కూడా పోస్ట్ చేసి ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాను అని తెలిపారు అమితాబ్.

Naatu Naatu Song : నాటు నాటుకు మరో అవార్డు.. సొసైటీ ఆఫ్ కంపోజర్స్, లిరిసిస్ట్ హాలీవుడ్ నుంచి అభినందనలు..

తాజాగా అమితాబ్ బ్లాగ్ లో రాసిన మ్యాటర్ వైరల్ గా మారింది. తన రోజువారీ బ్లాగ్ లో అనేక విషయాలు రాస్తారు అమితాబ్. నిన్నటి రోజున కూడా పలు విషయాలు రాసి చివర్లో.. “I shall hopefully return… “If I do not… rest well and my love.” అని రాశారు. అయితే ఇది తన గాయం గురించే అయి ఉంటుందని, నేను త్వరగా తిరిగివస్తాను.. రాకపోతే కంగారుపడకండి రెస్ట్ తీసుకుంటాను, మీ అందరికి నా ప్రేమ.. అన్నట్టు భావిస్తున్నారు. దీంతో అమితాబ్ రాసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల జరిగిన గాయం గురించేనా, ఇంకా తగ్గలేదా లేక ఏదైనా సీరియస్ అయిందా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా అమితాబ్ కోలుకోవాలని, మళ్ళీ తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.