Simbaa : ఓటీటీలో అదరగొడుతున్న అనసూయ, జగపతి బాబు సినిమా..
సింబా సినిమా అమెజాన్ ప్రైమ్ లో గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది.

Anasuya Jagapathi Babu Simbaa Movie Trending Top in Amazon Prime
Simbaa Movie : అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘సింబా’ సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త నిర్మాణంలో మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సింబా సినిమా తెరకెక్కింది.
సింబా సినిమాలో ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, చెట్లు మనకు ఎంత అవసరం అనే మెసేజ్ ని సెల్యులర్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో కలిపి సస్పెన్స్ జానర్ లో చూపించారు. సింబా సినిమా ఇటీవల సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది. రెండు ఓటీటీలలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఈ సినిమా.
Also Read : Gautam Ghattamaneni : అమెరికాలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ తనయుడు.. పిక్స్ వైరల్
సింబా సినిమా అమెజాన్ ప్రైమ్ లో గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 5లో సింబా సినిమా ట్రెండ్ అవుతుంది. థియేటర్లో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తుంది. ఇందులో జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కనిపిస్తే అనసూయ ఒక మంచి టీచర్ పాత్రలో కనిపిస్తూనే యాక్షన్ కూడా అదరగొట్టింది. కొత్త డైరెక్టర్ మురళి మనోహర్ సంపత్ నంది ఇచ్చిన కథని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించాడు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఎవరైనా సింబా మిస్ అయితే అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.