Anasuya : తమన్నాని రీప్లేస్ చేసిన అనసూయ.. తమన్నా కంటే రంగమ్మత్త రేంజ్ ఎక్కువ??

బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ గలగలా మాట్లాడాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా. జబర్దస్త్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ వ్యాఖ్యాతగా కూడా అదరగొడుతుంది. బుల్లితెరపైనే కాదు సినిమాల్లో కూడా తన సత్తా

Anasuya : తమన్నాని రీప్లేస్ చేసిన అనసూయ.. తమన్నా కంటే రంగమ్మత్త రేంజ్ ఎక్కువ??

Anasuya

Updated On : October 24, 2021 / 6:45 AM IST

Anasuya :  బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ గలగలా మాట్లాడాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా. జబర్దస్త్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ వ్యాఖ్యాతగా కూడా అదరగొడుతుంది. బుల్లితెరపైనే కాదు సినిమాల్లో కూడా తన సత్తా చాటుతుంది రంగమ్మత్త. సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తుంది. రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటుంది అనసూయ. ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా బుల్లితెరని మాత్రం వీడదు. ఇప్పటికే చాలా షోస్ కి యాంకర్ గా చేసిన అనసూయా తాజాగా మరో క్రేజీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది.

ఇటీవల తమన్నా తొలిసారి యాంకర్ గా వ్యవహరించిన షో `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు`. రకరకాల కొత్త వంటలను పరిచయం చేస్తూ కుకింగ్‌ లో కాంపిటేషన్ పెట్టే షో ఇది. జెమిని టీవిలో ప్రసారమయ్యే ఈ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించింది. తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు. అయితే తమన్నా హోస్ట్ చేసే ఈ షోకి అంతగా పాపులారిటీ, రేటింగ్‌ రావడం లేదట. తమన్నా తెలుగులో అంత పర్ఫెక్ట్ కూడా కాకపోవడంతో షో అంతగా క్రేజ్ సంపాదించుకోలేదు. దీంతో బుల్లితెరపై అందం చూపిస్తూ హోస్ట్ గా కూడా అదరగొట్టే అనసూయని ఈ షో కోసం తీసుకొచ్చారు. ఒకరి ప్లేస్ లో రీప్లేస్ అంటే రెమ్యూనరేషన్ కూడా భారీగానే అడుగుతారు. అనసూయకి కూడా ఈ షోకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

రాజీనామాలే అజెండాగా ‘మా’ కార్యవర్గ సమావేశం _ ‘MAA’ Working Group Meeting as Resignations Agenda

ప్రతి శుక్రవారం, శనివారం ఈ షో ప్రసారమవుతుంది. అనసూయ తన మొదటి ఎపిసోడ్ లోనే ప్రత్యేకంగా బ్లాక్ డ్రెస్ లో రెడీ అయి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. మొత్తానికి రంగమ్మత్త అటు సినిమా, ఇటు టీవీలోను దూసుకుపోతుంది.