Anchor Rashmi : తల్లి పాత్ర చేయబోతున్న యాంకర్ రష్మీ.. ఇద్దరు పిల్లలకు తల్లిగా.. చాన్నాళ్లకు మరో సినిమాతో..
రష్మీ చివరగా 2022 లో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Anchor Rashmi Vaitarani Movie Announced
Anchor Rashmi : యాంకర్ రష్మీ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ షోతో యాంకర్ గా మారి స్టార్ డమ్ తెచ్చుకుంది. టీవీ లో స్టార్ యాంకర్ గా పలు షోలతో బిజీగా ఉన్నా సినిమాల్లో అవకాశాలు వస్తే వదులుకోదు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్ గా కాస్త బోల్డ్ గా కూడా నటించి మెప్పించింది.
రష్మీ చివరగా 2022 లో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఓ మూడు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. అయితే రష్మీ ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. కానీ ఈసారి హీరోయిన్ గా కాదు. తల్లి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. అఖిల్ బాబు దర్శకత్వంలో ప్రదీప్ పల్లి, యాంకర్ రష్మీ మెయిన్ లీడ్స్ లో వైతరణి అనే సినిమాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.
Also Read : Tejaswini : మా పెళ్ళికి ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు.. ఆయనే ఒప్పించారు.. దిల్ రాజుతో పెళ్లి పై తేజస్విని..
ఈ పోస్టర్ లో ప్రదీప్, రష్మీతో పాటు ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి చుట్టూ శవాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో ఇదేదో థ్రిల్లర్, హారర్ సినిమాలా అనిపిస్తుంది. అందులో రష్మీ ఆ ఇద్దరి పిల్లలకు తల్లిగా ప్రదీప్ కి భార్య పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో నటనతో మెప్పించి, హీరోయిన్ మోజు పక్కన పెట్టి రష్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా బిజీ అవుతుందేమో చూడాలి.
Also Read : Kannappa : కన్నప్ప అదిరిందప్ప.. ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచు విష్ణు అదరగొట్టడుగా..!