Anil Kapoor : నన్ను హీరో చేసింది తెలుగువారే.. బాపుగారు లేకపోతే నేను లేను.. అనిల్ కపూర్ కామెంట్స్

యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ కపూర్ కామెంట్స్. నన్ను హీరో చేసింది తెలుగువారే, బాపుగారు లేకపోతే నేను లేను అంటూ..

Anil Kapoor : నన్ను హీరో చేసింది తెలుగువారే.. బాపుగారు లేకపోతే నేను లేను.. అనిల్ కపూర్ కామెంట్స్

Anil Kapoor emotional comments about his journey starts from telugu cinema

Updated On : November 27, 2023 / 9:33 PM IST

Anil Kapoor : రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. అండర్ వరల్డ్ డాన్ ప్లస్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్ తో పాటు చీఫ్ గెస్టులుగా మహేష్ బాబు, రాజమౌళి కూడా విచ్చేశారు.

ఇక ఈ ఈవెంట్ లో అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. అనిల్ కపూర్ కామెంట్స్.. “నన్ను హీరో చేసింది తెలుగువారే. లెజెండరీ డైరెక్టర్ బాపు గారు నన్ను హీరోగా తెలుగు సినిమాతోనే పరిచయం చేశారు. ఆయన వలనే నేను నేడు నటుడిగా మీ ముందు ఇలా ఉన్నాను. మొదటి సినిమాతో ఇక్కడి ఆడియన్స్ ని పలకరించిన నేను.. మళ్ళీ 43 ఏళ్ళ తరువాత ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. రష్మిక నీ లక్ నాకు కలిసి రావాలి. ఇన్నాళ్ల నా రీ ఎంట్రీకి నీ లక్ హెల్ప్ చేయాలి” అంటూ వ్యాఖ్యానించారు.

Also read : HariHara VeeraMallu : యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘హరిహర వీరమల్లు’లో డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్..

అనంతరం రాజమౌళి గురించి మాట్లాడుతూ.. “మీరు ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకు వెళ్లారు. మీరు అన్ని ఇండస్ట్రీస్ ని ఒకటి చేశారు. మీలాంటి ఒక దర్శకుడు మాకు కావాలి. మీరు మరిన్ని గొప్ప సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను” వెల్లడించారు. ఆ తరువాత మహేష్ బాబు, రణబీర్ కపూర్ ని వేదిక మీదకి పిలిచి.. పోకిరి సినిమాలోని ‘డొలె డొలె’ డాన్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అనిల్ కపూర్ 1980లో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా ‘వంశ వృక్షం’ సినిమాలో హీరోగా నటించి కెరీర్ స్టార్ట్ చేశారు.