Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!

తమిళ స్టార్ హీరో సూర్య నటించి, నిర్మించిన చిత్రం జై భీమ్. కనీసం థియేటర్లలో కూడా విడుదల కాకుండా.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్నీ వర్గాల ప్రేక్షకుల..

Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!

Jai Bhim

Updated On : January 21, 2022 / 3:18 PM IST

Jai Bhim: తమిళ స్టార్ హీరో సూర్య నటించి, నిర్మించిన చిత్రం జై భీమ్. కనీసం థియేటర్లలో కూడా విడుదల కాకుండా.. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించారు. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్యతో పాటు మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

ఐఎండిబిలో అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసి టాప్ లో నిలిచిన ఈ సినిమా హాలీవుడ్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసి ఈ ఫీట్ ను సాధించిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. కాగా, ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’’ 94వ ఆస్కార్స్ పరిశీలనకు అర్హత పొందిన 276 చిత్రాల జాబితాను వెల్లడించగా అందులో జైభీమ్ సినిమా కూడా ఉంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఆస్కార్ 2022 అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది.

New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

జైభీమ్ 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడబోతోంది. జనవరి 18న ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్‌లో జైభీమ్ సినిమా కూడా ప్రదర్శించబడగా ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ జైభీమ్ వీడియో చూసి ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!

కాగా.. ఆస్కార్ పరిశీలనలో ఉన్న 275 సినిమాలలో జైభీమ్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా పీరియాడికల్ డ్రామా మరక్కర్ కూడా అధికారికంగా ఆస్కార్ 2021 జాబితాలో నిలిచింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర అయిన కుంజలి మరక్కార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘మరక్కార్’కి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో చోటు దక్కించుకోవడం విశేషం.