Vani Bhojan: మహాన్‌లో మరో హీరోయిన్.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు!

తమిళ స్టార్ హీరో విక్రమ్.. తన సినిమాల సెలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. స్టోరీ సెలక్షన్ తోనే కాస్త వైవిధ్యంగా ఆలోచించే విక్రమ్.. భిన్నమైన పాత్రలతో..

Vani Bhojan: మహాన్‌లో మరో హీరోయిన్.. కానీ ఎడిటింగ్‌లో లేపేశారు!

Vani Bhojan

Updated On : February 13, 2022 / 9:14 PM IST

Vani Bhojan: తమిళ స్టార్ హీరో విక్రమ్.. తన సినిమాల సెలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. స్టోరీ సెలక్షన్ తోనే కాస్త వైవిధ్యంగా ఆలోచించే విక్రమ్.. భిన్నమైన పాత్రలతో వెర్సిటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. విక్రమ్ తాజా సినిమా మహాన్. ఈ సినిమాతో విక్రమ్ కుమారుడు ధృవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రీ కొడుకుల మల్టీస్టారర్ గా వచ్చిన మహాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయింది.

Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!

మద్యపాన నిషేధం అనే ఔట్డేటెడ్ కాన్సెప్ట్ అంతగా ప్రేక్షకులకు నచ్చకపోయినా.. సినిమాలో కమర్షియల్ హంగులు, విక్రమ్ నటన సినిమాని నిలబెట్టాయి. కథాపరంగా చెప్పుకోదగిన కాన్సెప్ట్ కాకపోయినా.. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఇందులో విక్రమ్ కు జంటగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ రీఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉందట. తెలుగులో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో కథానాయికగా నటించిన వాణి భోజన్‌ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్.

New Heroins: తెలుగు తెరపై కొత్త అందాలు.. స్టార్స్ అయ్యేది ఎవరో?

వాణీ భోజన్ నటించినట్లుగా గతం మహాన్ మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించి పోస్టర్లు కూడా విడుదల చేశారు. కానీ.. సినిమాలో ఎక్కడా వాణి భోజన్‌ కనిపించదు. ఎడిటింగ్ లో ఆమె పాత్రనే లేపేశారు. దీనికి కారణం సినిమా రన్ టైం. ఇప్పటికే ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంది. అదే వాణీ భోజన్ పాత్ర కూడా ఉంటే 3 గంటల రన్ టైం మించిపోతుంది. అందుకే ఎడిటింగ్ వాణీ పాత్రనే లేకుండా చేశారు. దీంతో మహాన్ లాంటి స్టార్ సినిమాలో నటించానన్న ఆనందమే తప్ప వాణీకి పేరు మాత్రం దక్కలేదు.