Ram Charan-Allu Arjun: భారీ మెగా మల్టీస్టారర్ పట్టాలెక్కుతోందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఇప్పటికే ‘ఎవడు’ సినిమాతో అలరించారు. అయితే, ఈ సినిమాను మల్టీస్టారర్ అనలేం. బన్నీ చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికీ..

Ram Charan-Allu Arjun: భారీ మెగా మల్టీస్టారర్ పట్టాలెక్కుతోందా..?

Ram Charan Allu Arjun

Updated On : August 31, 2021 / 1:48 PM IST

Ram Charan-Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఇప్పటికే ‘ఎవడు’ సినిమాతో అలరించారు. అయితే, ఈ సినిమాను మల్టీస్టారర్ అనలేం. బన్నీ చేసింది గెస్ట్ రోల్ అయినప్పటికీ ఈ సినిమా మల్టీస్టారర్ గా మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఈ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ సినిమా రెడీ అవుతుందనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అది కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుందని జరిగే ప్రచారంలో కీలక అంశంగా కనిపిస్తుంది.

నిజానికి ఈ ఇద్దరితో మల్టీస్టారర్ అన్నది నాలుగేళ్లుగా ప్రచారంలో ఉంది. ఆ మధ్య కన్నడలో తెరకెక్కిన ‘బహద్దూర్’ అనే సినిమా చూసిన అల్లు అరవింద్ ఈ సినిమాను రామ్ చరణ్-బన్నీ లతో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు. కానీ, అప్పుడు అది పట్టాలెక్కలేదు. అయితే, ఇప్పుడు టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ మల్టీస్టారర్ సినిమాతో మరోసారి చరణ్-బన్నీల మల్టీస్టారర్ తెరమీదకి వచ్చింది.

అది కూడా దర్శక దిగ్గజం రాజమౌళి ఇప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పి ఉన్నారు. ఈక్రమంలోనే బన్నీ-చరణ్ ల మల్టీస్టారర్ సినిమాను రాజమౌళితో చేయించాలన్నది నిర్మాత అల్లు అరవింద్ ఆలోచనగా తెలుస్తుంది. ఈ మెగా మల్టీస్టారర్ సినిమా కథ అప్పటి బహద్దూర్ రిమేక్ అవుతుందా.. లేక మరో కొత్త కథతో మల్టీస్టారర్ సినిమా అవుతుందా అనేది చూడాల్సి ఉంది. అయితే, అసలు ఈ ప్రపోజల్ కు రాజమౌళి ఒకే చెపుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.