Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. రేపు క్యాబినెట్ మీటింగ్ కి వస్తారా?

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. రేపు క్యాబినెట్ మీటింగ్ కి వస్తారా?

AP Deputy CM Pawan Kalyan Effected with Viral Fever and Spondylitis

Updated On : February 5, 2025 / 7:10 PM IST

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే జ్వరంతోపాటు స్పాండిలైటిస్ తో కూడా పవన్ బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా రేపు గురువారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ఓ పక్క ఏపీ అభివృద్ధి కోసం పాటు పడుతూనే మరో పక్క కుదిరినప్పుడల్లా చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. రెస్ట్ కూడా తీసుకోకుండా కంటిన్యూగా పనిచేయడం వల్లే పవన్ అస్వస్థతకు గురయ్యారని సమాచారం. పవన్ జ్వరంతోపాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారని తెలిసి ఫ్యాన్స్, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Also Read : Vizag Railway zone: వైజాగ్ కేంద్రంగా కొత్త ‘సౌత్ కోస్ట్’ రైల్వే జోన్.. మొత్తం 4 డివిజన్లు..!

ఇక ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న శాఖలలో పనులు పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. తన వద్ద ఉన్న శాఖలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలను ఫోకస్ చేస్తున్నారు.