Pawan Kalyan : అడవుల్లో పవన్ కళ్యాణ్.. వాగు వంక చెట్టు పుట్ట పరిశీలించి.. రెండు కిలోమీటర్లు నడిచి.. ఫోటోలు వైరల్..
డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర నడుస్తూ ప్రతి చెట్టునీ పరిశీలించారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని పరిసరాలను తిలకించారు. అనంతరం తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను సందర్శించి ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ లో ఇలా అడవుల్లో కనిపిస్తుండటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.






























