Tim Cook : యాపిల్ CEOకి వడాపావ్ తినిపించిన బాలీవుడ్ హీరోయిన్..

ముంబైలోని ఓ రెస్టారెంట్ కు టిమ్ కుక్‌ని తీసుకెళ్లింది మాధురి దీక్షిత్. ముంబై వడాపావ్ కి ఫేమస్ అని తెలిసిందే. దీంతో టిమ్ కుక్‌కి ముంబై వడాపావ్ టేస్ట్ చూపించింది.

Tim Cook : యాపిల్ CEOకి వడాపావ్ తినిపించిన బాలీవుడ్ హీరోయిన్..

Apple CEO Tim Cook eat Vadapav with Madhuri Dixit in Mumbai

Updated On : April 18, 2023 / 6:55 AM IST

Tim Cook :  యాపిల్(Apple) సీఈఓ(CEO) టిమ్ కుక్ భారతదేశానికి విచ్చేశారు. నేడు మంగళవారం ఇండియాలోనే తొలి యాపిల్ సొంత రిటైల్ స్టోర్ ని ముంబైలో(Mumbai) యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో యాపిల్ మార్కెట్ ని మరింత విస్తృతం చేసేందుకు టిమ్ కుక్(Tim Cook) ముంబైకి చేరుకున్నారు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్(Madhuri Dixit) టిమ్ కుక్‌కి తనదైన స్టైల్‌లో ముంబైలో ఫుడ్ తో వెల్కమ్ చెప్పింది.

ముంబైలోని ఓ రెస్టారెంట్ కు టిమ్ కుక్‌ని తీసుకెళ్లింది మాధురి దీక్షిత్. ముంబై వడాపావ్ కి ఫేమస్ అని తెలిసిందే. దీంతో టిమ్ కుక్‌కి ముంబై వడాపావ్ టేస్ట్ చూపించింది. వీరిద్దరూ సరదాగా వడాపావ్ తింటున్న ఫోటోని మాధురి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ముంబైలో వడాపావ్ ని మించి బెటర్ వెల్కమ్ దొరకదు అని పోస్ట్ చేసింది. మాధురి పోస్ట్ ని టిమ్ కుక్ రీషేర్ చేసి.. థ్యాంక్స్ మాధురి దీక్షిత్, మొదటిసారి నాకు వడాపావ్ ని పరిచయం చేసినందుకు. ఇది చాలా టేస్టీగా ఉంది అని పోస్ట్ చేశారు. దీంతో టిమ్ కుక్, మాధురి కలిసి వడాపావ్ తింటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Animal : యానిమల్ వచ్చేస్తుంది.. షూటింగ్ ఫినిష్ చేసిన రణబీర్..

ముంబైలో స్టోర్ ఓపెనింగ్ అనంతరం బుధవారం టిమ్ కుక్ ప్రధాని నరేంద్రమోదీని, ఐటీ శాఖ మంత్రిని కలిసి పలు చర్చలు జరుపుతారని సమాచారం. భారత్ లో యాపిల్ బిజినెస్ ని మరింత విస్తరించేలా ఈ చర్చలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది.