అర్జున్ కపూర్‌తో రకుల్ ప్రీత్
అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ జంటగా.. బాలీవుడ్‌లో కాష్వీ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది..

అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ జంటగా.. బాలీవుడ్‌లో కాష్వీ నాయర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది..
అజయ్ దేవ్ గణ్ పక్కన ‘దే దే ప్యార్ దే’లో నటించిన తర్వాత రకుల్ ప్రీత్ ‘మర్జావాన్’ సినిమా చేసింది.. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.. ఇప్పుడు హిందీలో మరో సినిమా కమిట్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో జతకడుతోంది రకుల్. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ జంటగా నటించబోయే ఈ సినిమా ద్వారా డైరెక్టర్ శషిలాల్ నాయర్ కుమార్తె, నిఖిల్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన కాష్వీ నాయర్ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. క్రాస్ బోర్డర్ డ్రమెడీగా రూపొందనున్న ఈ సినిమాను భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మోనీషా అద్వాణీ, మనీషా బోజ్వానీ, నిఖిల్ అద్వాణీ, జాన్ అబ్రహాం కలిసి నిర్మిస్తున్నారు.. నవంబర్‌లోనే షూటింగ్ స్టార్ట్ కానుంది.
Read Also : ‘రాజా నరసింహా’గా మమ్ముట్టి ‘మధుర రాజా’
పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ‘మన్మథుడు 2’ తర్వాత మరో తెలుగు సినిమా కమిట్ కాలేదు రకుల్.. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’, తో పాటు శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది.
Arjun Kapoor and Rakul Preet… The film – not titled yet – is directed by Kaashvie Nair… Produced by Bhushan Kumar, Krishan Kumar, Monisha Advani, Madhu Bhojwani, Nikkhil Advani and John Abraham… Starts this month. pic.twitter.com/kNgCsTjEFf
— taran adarsh (@taran_adarsh) November 6, 2019