Ashoka Vanam Lo Arjuna Kalyanam: కళ్యాణం డేట్ ఫిక్స్.. చూసేందుకు మీరు సిద్ధమా?
యువ హీరో విశ్వక్‌సేన్ సినిమా సినిమాకి తన క్యారెక్టర్ తో పాటు సినిమా కథల్లోనూ వ్యత్యాసం చూపిస్తూ తానేంటో నిరూపించుకునేందుకు గట్తిగానే కృషి చేస్తున్నాడు.

Ashoka Vanam Lo Arjuna Kalyanam
Ashoka Vanam Lo Arjuna Kalyanam: యువ హీరో విశ్వక్‌సేన్ సినిమా సినిమాకి తన క్యారెక్టర్ తో పాటు సినిమా కథల్లోనూ వ్యత్యాసం చూపిస్తూ తానేంటో నిరూపించుకునేందుకు గట్తిగానే కృషి చేస్తున్నాడు. కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించి అభిమానులని పెంచుకుంటున్న విశ్వక్.. ఇప్పుడు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో రాబోతున్నాడు.
Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!
రుష్కర్ దిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులని ఆకట్టుకోగా.. తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఒక మిడిల్ ఏజ్డ్ యువకుడిలా పెళ్లి కోసం ఆరాటపడే వాడిగా కనిపించి మంచి ఆసక్తి రేపిన విశ్వక్ ఇప్పుడు ఫైనల్ గా తన పెళ్లి.. అదే సినిమా రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసి ఆహ్వానం పంపాడు.
Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమాను విద్యా సాగర్ తెరకెక్కిస్తున్నాడు.