Balakrishna : ఫస్ట్ టైం ఓ కమర్షియల్ యాడ్ ప్రీమియర్ షో.. బాలయ్యా మజాకా..

ఇటీవలే వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి బాలయ్య, ప్రగ్య మీద ఓ యాడ్ షూట్ చేశారు. అలాగే బాలకృష్ణతో ఓ ఫోటోషూట్ కూడా చేసి వేగ జువెల్లర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ మీద యాడ్ ని భారీగా తెరకెక్కించినట్లు సమాచారం.................

Balakrishna : ఫస్ట్ టైం ఓ కమర్షియల్ యాడ్ ప్రీమియర్ షో.. బాలయ్యా మజాకా..

Balakrishna and pragya jaiswal commercial ad premiere in theaters creates new history

Updated On : March 5, 2023 / 8:57 AM IST

Balakrishna :  బాలకృష్ణ వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరో వైపు అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇన్ని రోజులు యాడ్స్ చేయని బాలయ్య బాబు కూడా ఇటీవల యాడ్స్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేశారు. ఆ యాడ్ లో చాలా స్టైలిష్ గా కనిపించి అదరగొట్టేసారు. తాజాగా బాలయ్య బాబు ఇప్పుడు మరో యాడ్ చేశారు.

ఇటీవలే వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి బాలయ్య, ప్రగ్య మీద ఓ యాడ్ షూట్ చేశారు. అలాగే బాలకృష్ణతో ఓ ఫోటోషూట్ కూడా చేసి వేగ జువెల్లర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ మీద యాడ్ ని భారీగా తెరకెక్కించినట్లు సమాచారం. ఇప్పటికే బాలకృష్ణ తన సినిమాలతో, అన్‌స్టాపబుల్ షోతో పలు రికార్డులని సృష్టించగా ఇప్పుడు ఈ యాడ్ తో మరో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.

Allu Arjun : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లైవ్ కాన్సర్ట్ లో నెదర్లాండ్ సింగర్‌తో కలిసి స్టెప్పులేసిన బన్నీ..

మొదటి సారి ఒక కమర్షియల్ యాడ్ ని థియేటర్ లో ప్రీమియర్ షో వేసి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఇలా ఒక యాడ్ కి థియేటర్ లో ప్రీమియర్ షో వేసింది లేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ యాడ్ తో మొదలవ్వనుంది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ కలిసి నటించిన వేగ జువెల్లర్స్ యాడ్ ని మార్చ్ 5 మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో, అలాగే సాయంత్రం 5 గంటలకు విజయవాడ లోని ట్రెండ్ సెట్ మాల్ లో ప్రీమియర్ వేయనున్నారు. ఈ నిర్ణయంపై బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు భారీగా ఈ యాడ్ ప్రీమియర్ కి రానున్నారు. బాలకృష్ణ హైదరాబాద్ AMB సినిమాస్ లో జరిగే ప్రీమియర్ కి హాజరు కానున్నట్టు సమాచారం.

View this post on Instagram

A post shared by Shreyas Media (@shreyasgroup)