Balakrishna : బాలయ్య బాబు బ్యాగ్ చూశారా? సింహమే సింహాన్ని భుజాన వేసుకుంది..

తాజాగా బాలయ్య అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ కాకుండా మరో విషయంలో వైరల్ అవుతున్నారు.

Balakrishna : బాలయ్య బాబు బ్యాగ్ చూశారా? సింహమే సింహాన్ని భుజాన వేసుకుంది..

Balakrishna Bag having a lion Image Balayya Lion Bag goes viral

Updated On : September 22, 2023 / 4:22 PM IST

Balakrishna Bag : బాలకృష్ణ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో(AP Politics) ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. ఇన్నాళ్లు సినిమాల్లో తొడ కొడుతూ మీసం మెలేసిన బాలయ్య ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో మీసాలు తిప్పుతూ, విజిల్స్ వేస్తూ హడావిడి చేస్తున్నారు. ఇక బాలయ్య ఇటీవల అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera Simha Reddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ దసరా(Dasara)కి భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ.

తాజాగా బాలయ్య అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ కాకుండా మరో విషయంలో వైరల్ అవుతున్నారు. బాలకృష్ణ సినిమాల్లో బాలయ్య బాబుని సింహం అని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. చాలా సినిమాల్లో పవర్ ఫుల్ సీన్స్ లో బాలకృష్ణని సింహంలా చూపించడం, బాలయ్య పక్కన సింహాలు చూపించడం, ఆయన సినిమా టైటిల్స్ లో సింహ ఉండేలా చేస్తారు. తాజాగా బాలకృష్ణ వేసుకున్న బ్యాగు వైరల్ గా మారింది.

Also Read : Rakshit Shetty : రష్మికతో బ్రేకప్ పై రక్షిత్ శెట్టి వైరల్ కామెంట్స్.. నా వ్యక్తిగత జీవితమే..!

ఇటీవల హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ(Vijayawada) వెళ్లిన బాలకృష్ణ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగాక భుజాన ఓ బ్యాగు వేసుకొని వెళ్లారు. అయితే ఆ బ్యాగ్ మీద సింహం తల ఉన్న బొమ్మ ఉంది. గోల్డ్ కలర్ లో బ్యాగ్ అంతా సరిపోయేలా జూలు ఉన్న సింహం(Lion) ఉంది. బాలయ్య సినిమాల్లో చూపించినట్టే సింహం బొమ్మ ఉండటంతో ఈ బ్యాగ్ వైరల్ గా మారింది. దీంతో సింహమే సింహం బ్యాగు వేసుకొని వెళ్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి బాలయ్య తన లయన్ బ్యాగుతో కూడా వైరల్ అవుతున్నారు.