Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ దసరాకి రావడం కష్టమా.. బ్యాలన్స్ షూట్..!

బాల‌కృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' దసరాకి రావడం కష్టమంటూ టాక్ వినిపిస్తుంది. సినిమాకి సంబంధించిన బ్యాలన్స్ షూట్..

Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ దసరాకి రావడం కష్టమా.. బ్యాలన్స్ షూట్..!

Balakrishna Bhagavanth Kesari is difficult to release on announced date

Updated On : September 17, 2023 / 7:12 PM IST

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మూవీతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలను అభిమానులు ఆశ పడుతున్నారు. దీంతో మూవీ పై భారీ హైప్ నెలకుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Mounika Reddy : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హీరోయిన్‌గా మోనిక రెడ్డి ఎంట్రీ..

అయితే ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమంటూ టాక్ వినిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ జరగడంతో బాలకృష్ణ.. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇక్కడ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. రిలీజ్ చూస్తే మరో నెల మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆంధ్రాలో పాలిటిక్స్ కూడా కూల్ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

7G Brindavan Colony : 7జీ బృందావన కాలని సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ.. వచ్చే నెల నుంచి..

ఇది ఇలా ఉంటే, కొందరు సినీ వర్గానికి చెందిన వారు చెబుతున్న విషయం ఏంటంటే.. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం సినిమా షూటింగ్ పూర్తి అయ్యినట్లు చెబుతున్నారు. అలాగే డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. థమన్ కూడా ఆర్ఆర్ వర్క్ స్టార్ట్ చేశాడట. అక్టోబర్ 12కు అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సెట్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే వేచి చూడాలి. కాగా ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal) హీరోయిన్‌గా, శ్రీలీల (Sreeleela) బాలయ్య కూతురిగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) విలన్‌గా కనిపించబోతున్నారు.