Balakrishna – NBK 109 : మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య.. ఈసారి చరణ్‌తో పోటీ.. NBK109 అప్డేట్..
తాజాగా నేడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.

Balakrishna NBK 109 Movie Update announced on Dasara Details Here
Balakrishna – NBK 109 : బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా నేడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. NBK 109 సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. అలాగే టైటిల్ అనౌన్స్ దీపావళికి చేస్తారని ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Game changer : గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్..
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది పీరియాడిక్ యాక్షన్ సినిమా అని సమాచారం. తాజా అప్డేట్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేయగా అందులో ఫేస్ కనిపించకపోయినా బాలయ్య ఓ గుర్రంపై కూర్చున్నట్టు ఉంది. దీంతో బాలయ్య మళ్ళీ గుర్రం ఎక్కాడు అంటే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా రాబోతున్నట్టు ఇవాళే ప్రకటించారు. గతంలో చిరంజీవితో బాలయ్య పలుమార్లు సంక్రాంతికి పోటీ పడగా ఈసారి చిరు తనయుడితో పోటీ పడబోతున్నాడు. ఈ సినిమాతో తన హ్యాట్రిక్ హిట్ ని బాలయ్య కంటిన్యూ చేస్తాడని ఫ్యాన్స్, టాలీవుడ్ భావిస్తుంది. ఇక నేడు అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా అనౌన్స్ చేసి ప్రోమో రిలీజ్ చేయడంతో దసరా పండగ పూట బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
Team #NBK109 wishes you all a #HappyDussehra 🔱🔥
Get ready to meet the 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna garu, in his most stylish action avatar yet this Sankranti 2025! 💥🤙🏻#NBK109TitleTeaser will be out this Diwali❤️🔥@dirbobby @MusicThaman @thedeol… pic.twitter.com/MUgwLB0Kwc
— Sithara Entertainments (@SitharaEnts) October 12, 2024