Balakrishna : శివశంకరి శివానంద లహరి.. స్టేజి పై బాలయ్య పాట వైరల్!
ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో స్టేజి పై శివశంకరి శివానంద లహరి పాట పాడి అదరగొట్టిన బాలయ్య. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

Balakrishna sing a song on stage at NTR 100 years function
Balakrishna : నందమూరి బాలకృష్ణ పబ్లిక్ స్టేజిలు పై ఎంత ఉత్సాహంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను (100 years of NTR) ఘనంగా నిర్వహించే పనిలో ఉన్నాడు. గత ఏడాది కాలంగా జరుగుతున్న ఈ వేడుకలు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఖతార్ లోని దోహాలో కూడా ఎన్టీఆర్ అభిమానులు శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దీంతో భాగంగానే ఈ శుక్రవారం ఒక ఈవెంట్ నిర్వహించారు.
NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో స్టేజి పై ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ చిత్రంలోని ‘శివశంకరి శివానంద లహరి’ సాంగ్ ని పాడి అదరగొట్టాడు. సాంగ్ లాస్ట్ లో బాలయ్య సరిగమలను అలవోకగా పలుకుతూ ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ పాటని బాలకృష్ణ గతంలో కూడా పాడాడు. 2020 లో తన బర్త్ డే రోజు ఈ పాటని పాడి ఒక విదేవుగా చిత్రీకరించి రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు స్టేజి పై లైవ్ లో పాడడంతో అభిమానులు అరుస్తూ, చప్పట్లతో అభిమానాన్ని చాటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడితో NBK108 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస హిట్టులు అందుకున్న బాలయ్య ఈ మూవీతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు.
balayya ? pic.twitter.com/hDcGbkRpKD
— devipriya (@sairaaj44) May 6, 2023