Bhagavanth Kesari Review : భగవంత్ కేసరి రివ్యూ.. ఈసారి బాలయ్య మాస్ కాదు ఎమోషన్ తో మెసేజ్..
నేలకొండ భగవంత్ కేసరి బాలయ్య మార్క్ మాస్ దూరం పెట్టి ఎమోషన్, మెసేజ్ తో నడిచే సినిమా.

Balakrishna Sreeleela Kajal Anil Ravipudi Bhagavanth Kesari Movie Review and Rating
Bhagavanth Kesari Review : అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్రలో నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా దసరా కానుకగా నేడు అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. జైలులో ఉండే భగవంత్ కేసరి(బాలకృష్ణ) జైలర్(శరత్ కుమార్) కి, అతని పాపకి దగ్గరవుతాడు. భగవంత్ కేసరికి సహాయం చేసినందుకు జైలర్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. భగవంత్ కేసరి బయటకి వచ్చాక జైలర్ ని మళ్ళీ కలుస్తాడు. అనుకోకుండా జైలర్ యాక్సిడెంట్ కి గురయి చనిపోవడంతో ఆ పాప బాధ్యత తాను తీసుకుంటాడు. జైలర్ కి ఇచ్చిన మాట కోసం విజ్జి పాప(శ్రీలీల)ని ఎలాగైనా ఆర్మీకి పంపాలనుకుంటుంది. భగవంత్ కేసరి విజ్జిపాప ప్రేమను కాదనడంతో అతనిని దూరం పెడుతుంది. అదే సమయంలో విలన్ గ్యాంగ్ విజ్జిపాప ని చంపాలని చూస్తారు. విలన్ విజ్జిపాపని ఎందుకు చంపాలనుకుంటారు? విజ్జిపాప ఆర్మీకి సెలెక్ట్ అయిందా? భగవంత్ కేసరి విజ్జిపాప మళ్ళీ ఎలా కలిశారు? విలన్ కి భగవంత్ కేసరికి ఉన్న సంబంధం ఏంటి? అసలు భగవంత్ కేసరి జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ పరంగా చూస్తే.. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లోనే భగవంత్ కేసరి-విజ్జిపాప మధ్య బాండింగ్, ఇంటర్వెల్ ముందు వీరిద్దరి మధ్య దూరం పెరగడంతో అక్కడ ఎమోషన్, మధ్యలో కాజల్ తో కొన్ని సీన్స్ అంటూ బాగానే వర్కౌట్ చేసినా ఇంకా ఇంటర్వెల్ రాలేదా అని అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ బాలయ్యకు తగ్గట్టు ఉంటుంది. ఇంటర్వెల్ కి కథ మొత్తం అర్థమైపోతుంది ఇది ఒక రివెంజ్ డ్రామా అని. దీంతో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ లో భగవంత్ కేసరి పోలీసాఫీసర్ గా చూపించి విలన్ కి, భగవంత్ కేసరి మధ్య ఉన్న గొడవ ఏంటో చూపించి ఆసక్తిగా మార్చారు. సెకండ్ హాఫ్ లో పక్క విజ్జి పాపని ఆర్మీకి తయారు చేస్తూనే మరో పక్క మహిళా శక్తి గురించి చెప్తాడు. అయితే అక్కడ పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే సీన్ సింక్ అవ్వకపోయినా ఒక మంచి మెసేజ్ బాలయ్యతో చెప్పించాలని పెట్టినట్టు ఉంటుంది. చివరికి అన్ని సినిమాల్లో లాగే విలన్ కి, హీరోకి మధ్య ఫైట్ ఉంటుంది. కాకపోతే ఇందులో క్లైమాక్స్ మళ్ళీ మహిళా శక్తి అనే కాన్సెప్ట్ తో శ్రీలీల బాలయ్య కలిసి ఫైట్ చేయడం విశేషం.
Also Read : Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ప్రీమియర్స్ టాక్ ఏంటి..?
సినిమా ప్లస్ లు.. బాలకృష్ణ తెలంగాణ స్లాంగ్ మొదటిసారి అయినా పర్ఫెక్ట్ గా చేయడం. విజ్జి పాప క్యారెక్టర్ ని శ్రీలీల బాగా డీల్ చేయడం, బాలయ్య – శ్రీలీల మధ్య ఎమోషన్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అక్కడక్కడా బాలయ్యతో అనిల్ రావిపూడి కామెడీ మార్క్, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్యతో మంచి మెసేజ్ చెప్పించడం.
సినిమా మైనస్ లు.. బాలయ్య – కాజల్ సన్నివేశాలు, కథ రొటీన్ రివెంజ్ డ్రామా అవడం, ఒక్క ఇంటర్వెల్ ఫైట్ తప్ప బాలయ్యకు తగ్గ మాస్ లేకపోవడం, సెకండ్ హాఫ్ లో సింక్ లేకుండా వచ్చే కొన్ని సన్నివేశాలు, అక్కడక్కడా హిందీ డైలాగ్స్, వాటికి సబ్ టైటిల్స్ కూడా లేకపోవడం, కొన్ని లాజిక్ లెస్ సీన్స్, క్లైమాక్స్ సినిమా అంతా అయ్యాక ఓ సీన్.
మొత్తంగా నేలకొండ భగవంత్ కేసరి బాలయ్య మార్క్ మాస్ దూరం పెట్టి ఎమోషన్, మెసేజ్ తో నడిచే సినిమా.