బోయపాటి కోసం బరువు తగ్గనున్న బాలయ్య

కె.ఎస్.రవికుమార్ సినిమా పూర్తవ్వగానే, వెయిట్ లాస్ అయ్యే పనిలో పడతాడట బాలయ్య..

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 09:38 AM IST
బోయపాటి కోసం బరువు తగ్గనున్న బాలయ్య

Updated On : April 29, 2019 / 9:38 AM IST

కె.ఎస్.రవికుమార్ సినిమా పూర్తవ్వగానే, వెయిట్ లాస్ అయ్యే పనిలో పడతాడట బాలయ్య..

సినిమా సినిమాకీ ఏదో ఒక వైవిధ్యం చూపించాలని పరితపిస్తుంటాడు నటసింహ నందమూరి బాలకృష్ణ.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడాని కంటే ముందు, జై సింహా దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌‌తో ఒక సినిమా చెయ్యనున్నాడు బాలయ్య. సి.కళ్యాణ్ నిర్మాత. మాగ్జిమమ్ మూడు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేసేసి, తర్వాత బోయపాటి సినిమాకి షిఫ్ట్ అవ్వాలనేది బాలయ్య ప్లాన్. సింహా, లెజెండ్ మాదిరిగానే ఈ మూవీలోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడట.

ఈ సినిమా కోసం బాలయ్యని బరువు తగ్గమని బోయపాటి చెప్పాడట. అదికూడా దాదాపు 20 కిలోలు తగ్గాల్సిందే అన్నాడట. ఎంత ఎనర్జీగా ఉన్నా, ముందునుండీ బాలయ్య ఫిజిక్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టడు. అలాంటిది 58 ఏళ్ళ వయసులో ఇంత రిస్క్ చెయ్యగలడా.. అనుకుంటూ ఉండగా, తప్పకుండా బరువు తగ్గుతా అని బాలయ్య అన్నాడట. కె.ఎస్.రవికుమార్ సినిమా పూర్తవ్వగానే, వెయిట్ లాస్ అయ్యే పనిలో పడతాడట బాలయ్య. ఈ మూవీలో జగపతిబాబు విలన్‌‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. మే నెలలో సి.కళ్యాణ్ సినిమా, జూన్‌లో బోయపాటి సినిమా ప్రారంభం కానున్నాయి.