Bheemla Nayak: ఏప్రిల్‌కు విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్..

Bheemla Nayak: ఏప్రిల్‌కు విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

Bheemla Nayak

Updated On : February 14, 2022 / 12:59 PM IST

Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావించినా అప్పుడు భారీ సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడింది.

Gurthunda Seethakalam Trailar: చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం.. శీతాకాలం!

కరోనా తగ్గి ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తే అప్పుడే భీమ్లా నాయక్ వచ్చేస్తుందని.. ఏపీలో థియేటర్ల సమస్య.. టికెట్ ధరల తగ్గింపు అంశం ఎప్పుడు పరిష్కారమైతే అప్పుడే తమ సినిమా రిలీజ్ చేస్తామని.. భీమ్లా నాయక్ నిర్మాతలు ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఏపీలో సమస్య పరిష్కార దిశగా వెళ్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి నెలాఖరుకి ఈ సమస్య పరిష్కారం కానుంది. తెలంగాణలో కరోనా ఆంక్షలు అసలే లేవు. మిగతా రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి.

F3 Movie: ఎఫ్3 మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే?

దీంతో భీమ్లా నాయక్ సినిమా ఏప్రిల్ 1నే థియేటర్లలోకి వచ్చేయడం ఖాయమని పవన్ అభిమానులు ఫిక్సయ్యారు. అయితే.. భీమ్లా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. దానికి కారణం అజిత్ సినిమా వలిమై. వలిమై సినిమాను పాన్ ఇండియా సినిమాగా ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. కాగా.. వలిమై సినిమాను తెలుగు రాష్ట్రాలలో నాలుగు ప్రాంతాల హక్కులను భీమ్లా నాయక్ నిర్మాతలే దక్కించుకున్నారట. దీంతో బిజినెస్ పరంగా ఏప్రిల్ తొలివారంలో భీమ్లా వస్తే ఇబ్బందులు తప్పవు. దీంతో భీమ్లాను ఏప్రిల్ కి వాయిదా వేసే అవకాశాలున్నట్లు టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.