Bigg Boss 5 Telugu : అతడికొక్కడికే భారీ రెమ్యూనరేషన్!

షణ్ముక్...ఇతను ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో యూ ట్యూబ్ లో పోస్టు చేసే వీడియోలకు భారీ రెస్పాండ్ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాల వీడియోలకు రాని వ్యూస్, లైక్స్ అతని వీడియోలకు వస్తుంటాయి. ఒక్క వీడియో పోస్టు చేస్తే...అది కొన్ని రోజులకే ట్రెండింగ్ లోకి వస్తుంటాయి.

Bigg Boss 5 Telugu : అతడికొక్కడికే భారీ రెమ్యూనరేషన్!

Bigg Boss

Updated On : August 6, 2021 / 5:02 PM IST

Bigg Boss 5 Telugu : బుల్లితెరపై మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ‘బిగ్ బాస్’ వచ్చేస్తోంది. ఇప్పటికే నాలుగు రియాల్టీ షోలు ఎంతగానో అలరించాయి. తాజాగా..బిగ్ బాస్ 05 లోగోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మా నిర్వహిస్తున్న ఈ షో..లో పాల్గొనే కంటెస్టెంట్ ల విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఎంతో మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా…ఓ లిస్ట్ బయటకు వచ్చింది.

Read More : International Beer Day : ‘బీర్‌’ పుట్టుకకు మూలం మహిళలే..బీరు డే ‘అలా మొదలైంది’..

ఇందులో లోబో, యాంకర్‌ ప్రత్యూష, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, యాంకర్‌ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, పూనం భాజ్వా, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, జబర్దస్త్‌ ప్రియాంక, ఆనీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, యాంకర్‌ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే..ఇందులో పాల్గొనే వారి రెమ్యూనరేషన్ విషయంలో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అందరికంటే..ఎక్కువగా షణ్ముఖ్ జస్వంత్ కు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

Read More : Pori Moni: డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్.. ఆ రాజకీయ నాయకుడి పనేనా?

షణ్ముక్…ఇతను ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో యూ ట్యూబ్ లో పోస్టు చేసే వీడియోలకు భారీ రెస్పాండ్ ఉంటుంది. పెద్ద హీరోల సినిమాల వీడియోలకు రాని వ్యూస్, లైక్స్ అతని వీడియోలకు వస్తుంటాయి. ఒక్క వీడియో పోస్టు చేస్తే…అది కొన్ని రోజులకే ట్రెండింగ్ లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో…గతంలో కూడా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనాలని నిర్వాహకులు సంప్రదించిన అతను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

Read More : Ap Cabinet : ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి

తాజాగా..ఈ సీజన్ కు మాత్రం ఒకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో షణ్ముఖ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. మరే కంటెస్టెంట్ కు లేని విధంగా షణ్ముఖ్ కు కోటి రూపాయల వరకు పారితోషకం ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించారని టాక్. సెప్టెంబర్ 05వ తేదీన బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభించాలని నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.