Bigg Boss 7 Day 21 : మళ్ళీ లేడీ కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. ఆదివారం స్పెషల్ స్కంద రామ్..

శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్‌బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.

Bigg Boss 7 Day 21 : మళ్ళీ లేడీ కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. ఆదివారం స్పెషల్ స్కంద రామ్..

Bigg Boss 7 Day 21 Highlights Who is eliminated from house in Third Week Ram Pothineni Special Appearance

Bigg Boss 7 Day 21 : బిగ్‌బాస్ మూడు వారాలు పూర్తయిపోయింది. శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్‌బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.

ముందుగా ఆదివారం ఎంటర్టైన్మెంట్ తో మొదలుపెట్టాలని నాగార్జున ఓ గేమ్ తో వచ్చాడు. చిట్టి ప్రశ్నలు అనే టాస్క్ పెట్టి కలర్స్ ఉన్న చక్రంని తిప్పి అది ఏ రంగు దగ్గర ఆగితే ఆ చీటీ తీసి అందులో ఉన్న ప్రశ్నకు ఎవరు సూట్ అవుతారో వాళ్ళ పేరు చెప్పాలి అని కంటెస్టెంట్స్ కి చెప్పాడు నాగార్జున. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించారు. ఆ ప్రశ్నలు కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టె లాగే ఉన్నాయి.

అనంతరం స్కంద(Skanda) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రామ్(Ram) బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ కంటెస్టెంట్స్ కి మ్యూజిక్ ప్లే అవుతుంది పాటని గెస్ చేయమని ఓ గేమ్ పెట్టాడు. కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఈ గేమ్ ఆడించగా సింగర్ దామిని ఉన్న టీం గెలిచింది.

Also Read : Bigg Boss Telugu 7 Elimination : మూడో వారంలో ఎలిమినేట్ కానుంది ఎవ‌రో తెలుసా..?

ఇక నామినేషన్స్ లో ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు నాగ్. మొదట ప్రియాంక, గౌతమ్ ఆ తర్వాత రతిక, ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్ సేవ్ అయ్యారు. చివరగా శుభశ్రీ, దామిని మిగలగా దామిని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు నాగ్. అనంతరం దామిని హౌస్ లోంచి బయటకి వచ్చి స్టేజి మీదకు వెళ్లి హౌస్ లో కంటెస్టెంట్స్ కి సలహాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శివాజీ – దామిని మధ్య గొడవ అయింది. ఇక చివరగా వెళ్ళిపోతూ బిగ్‌బాస్ పై తను రాసిన ఒక పాటని పాడి వినిపించింది.