Bigg Boss 7 : నేటి నుంచే బిగ్బాస్ సీజన్ 7.. ఎక్కడ చూడొచ్చు? టైమింగ్స్ ఏంటి?
బిగ్బాస్ సీజన్ 7 నేడు సెప్టెంబర్ 3 సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. నేడు ఓపెనింగ్ రోజు కాబట్టి బిగ్బాస్ షో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
![Bigg Boss 7 : నేటి నుంచే బిగ్బాస్ సీజన్ 7.. ఎక్కడ చూడొచ్చు? టైమింగ్స్ ఏంటి? Bigg Boss 7 : నేటి నుంచే బిగ్బాస్ సీజన్ 7.. ఎక్కడ చూడొచ్చు? టైమింగ్స్ ఏంటి?](https://10tv.in/wp-content/uploads/2023/09/nagarjuna-bigg-boss.jpg)
Bigg Boss 7 Show starts from today evening Nagarjuna as Guest Show Timings Details
Bigg Boss 7 : తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 7 సిద్ధమైపోయింది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేసి ఈ సారి ఉల్టా పల్టా అంటూ ఆడియన్స్ కి షోపై మరింత ఆసక్తి పెంచారు. బిగ్బాస్ సీజన్ 7 ప్రకటించడంతో షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సారి కూడా నాగార్జుననే(Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ చేయనున్నారు.
బిగ్బాస్ సీజన్ 7 నేడు సెప్టెంబర్ 3 సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. నేడు ఓపెనింగ్ రోజు కాబట్టి బిగ్బాస్ షో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. నాగార్జున ఎంట్రీతో పాటు కొన్ని స్పెషల్ డ్యాన్సులు, పర్ఫార్మెన్సుల తర్వాత ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పిలుస్తారు. కంటెస్టెంట్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ల తర్వాత వారిని హౌస్ లోకి పంపిస్తారు. ఈ షో స్టార్ మా(Star Maa) ఛానల్ లో టెలికాస్ట్ అవుతుంది.
ఇక రేపట్నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు బిగ్బాస్ షో చూడొచ్చు. శని, ఆది వారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. ఛానల్ లో గంట సేపు మాత్రమే బిగ్బాస్ షో టెలికాస్ట్ ఉంటుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) ఓటీటీలో 24 గంటలు లైవ్ చూడొచ్చు. ఇప్పటికే బిగ్బాస్ షో ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి.
RGV : నల్లమల అడవుల్లో గన్స్ పట్టుకొని వైల్డ్ యానిమల్లా తిరిగేస్తున్న ఆర్జీవీ..
అధికారికంగా తెలియకపోయినా బిగ్బాస్ సీజన్ 7లో ఈ సారి పాల్గొనబోయేది వీళ్ళే అని కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు అయితే వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సారి బిగ్బాస్ సీజన్ 7లో అమరదీప్ – తేజస్విని జంట, ఢీ పండు, జబర్దస్త్ అప్పారావు, ఆట సందీప్, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ఓ యూట్యూబ్ మేల్ యాంకర్, యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల, హీరోయిన్ ఎస్తర్ నోరాన్హా, యాంకర్ శశి, ఓ సీరియల్ నటి, సురేఖ వాణి, సుప్రీతా, జబర్దస్త్ కెవ్వు కార్తిక్.. పాల్గొంటారని టాక్. నేడు సాయంత్రానికి షో మొదలైతే తప్ప ఎవరెవరు షో లో ఉన్నారో అధికారికంగా తెలియదు.
The King is back! 👑 @iamnagarjuna returns to reign over Bigg Boss, and this season is like no other. 👁️🗨️ It's all about 'King ka hukum,' Don't miss the Grand Launch tomorrow at 7 PM Only on #StarMaa 📺🎉 #BiggBossTeugu7 @DisneyPlusHSTel pic.twitter.com/NEnnVzT9z2
— Starmaa (@StarMaa) September 2, 2023