Pallavi Prashanth : జైలు నుంచి వచ్చాక పల్లవి ప్రశాంత్ సెలబ్రేషన్స్.. ‘స్పై’ బ్యాచ్ తో కలిసి..
ఇటీవలే ప్రశాంత్ జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక మొదటిసారి బిగ్‌బాస్ హౌస్ లోని తన సపోర్టర్స్ తో పార్టీ చేసుకున్నాడు ప్రశాంత్.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Party with Sivaji Prince Yawar Bhole Subha Shree Nayani Pavani Photos goes Viral
Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో సీజన్ 2లో కౌశల్ విన్ అయినప్పుడు జరిగిన రేంజ్ లో పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాక ఆ రేంజ్ లో రచ్చ జరిగింది. ప్రశాంత్ అభిమానులు బిగ్‌బాస్ హౌస్ బయట రచ్చ చేయడం, వేరే కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగలకొట్టడం, ప్రశాంత్ పోలీసుల మాట వినకుండా రోడ్ షో చేయడం, అతని అభిమానులు నానా హంగామా చేయడం, ఆ పర్యవసానాలతో పోలీసులు ప్రశాంత్ తో పాటు పలువురిని అరెస్ట్ చేయడం.. ఇలా గత కొన్ని రోజులుగా పల్లవి ప్రశాంత్ వైరల్ అవుతూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
ఇటీవలే జైలుకి వెళ్లి ప్రశాంత్ బెయిల్ మీద బయటకి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక మొదటిసారి బిగ్‌బాస్ హౌస్ లోని తన సపోర్టర్స్ తో పార్టీ చేసుకున్నాడు ప్రశాంత్. ఈ పార్టీలో స్పై బ్యాచ్ శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఈ పార్టీకి టేస్టీ తేజ, భోలే, శుభశ్రీ, నాయని పావని కూడా పాల్గొన్నారు. హౌస్ లో రెండు గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. సీరియల్స్ బ్యాచ్ కాకుండా శివాజీ గ్రూప్ అంతా ఇప్పుడు కలిసి పార్టీ చేసుకున్నారు.
Also Read : Namrata Upasana : మెగా – ఘట్టమనేని క్రిస్మస్.. ఉపాసనతో నమ్రత.. చరణ్, మహేష్ ఎక్కడ?
భోలే ఇంట్లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తుంది. ప్రశాంత్, యావర్, శుభశ్రీ, తేజ కలిసి ఒకే కార్ లో వెళ్లారు. ఆ కార్ లో తేజ తీసిన వీడియోలు, భోలే ఇంటి దగ్గర ఈ బ్యాచ్ అంతా ఎంజాయ్ చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కంటెస్టెంట్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరి ఈ పార్టీపై సీరియల్ బ్యాచ్ ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.