Prince Yawar : బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్.. మోడల్ ప్రిన్స్ యావర్.. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడుగా..

బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి సారి షోలో ఒక మోడల్ ని కూడా తీసుకొస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యావర్ ని తీసుకొచ్చారు.

Prince Yawar : బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్.. మోడల్ ప్రిన్స్ యావర్.. సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడుగా..

Bigg Boss Season 7 Fourth Contestant Model and Actor Prince Yawar Details

Prince Yawar : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి సారి షోలో ఒక మోడల్ ని కూడా తీసుకొస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యావర్ ని తీసుకొచ్చారు.

Damini Bhatla : బిగ్‌బాస్ సీజన్ 7లో మూడవ కంటెస్టెంట్.. సింగర్ దామిని గురించి.. పాడుతా తీయగా నుంచి ప్రస్థానం..

మోడలింగ్ చేస్తున్న యావర్ పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు కూడా వేశాడు. మోడలింగ్ చేస్తూ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాడు. మరో పక్క అవకాశాలు రాకపోవడంత కరోనా సమయం తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో తన సిక్స్ ప్యాక్ ఫిట్నెస్ బాడీ చూపిస్తూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే తన బాడీని చూపిస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. మరి తన బాడీతో, బిగ్ బాస్ లో తన ఆటతో ఎంతమందిని మెప్పిస్తాడా చూడాలి. ఇక యావర్ కి తెలుగు సరిగ్గా రాదని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Prince Yawar (@princeyawar)