Aata Sandeep : బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడవ కంటెస్టెంట్.. ఆట సందీప్.. డ్యాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ గా ప్రయాణం..
బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడవ కంటెస్టెంట్ గా ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ఆట సందీప్(Aata Sandeep) ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Season 7 Seventh Contestant Famous Dance Master Aata Sandeep Full Details
Aata Sandeep : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నిప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడవ కంటెస్టెంట్ గా ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ఆట సందీప్(Aata Sandeep) ఎంట్రీ ఇచ్చాడు.
టాలీవుడ్ లో సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టిన సందీప్ ఆట షోలో డ్యాన్సర్ గా టైటిల్ గెలుచుకొని ఆట సందీప్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి స్టేజి షోలు, సినిమా ఈవెంట్స్, టీవీ షోలలో తన డ్యాన్స్ తో అలరిస్తున్నాడు. తన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డ్యాన్సర్. ఇద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ లు ఇస్తూ ఉంటారు. సందీప్ ఇప్పటికే పలు చిన్న సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేస్తున్నాడు. ఒక పెద్ద సినిమా అవకాశం వస్తే సందీప్ కు మంచి బ్రేక్ వస్తుందని ఎదురుచూస్తున్నాడు. మరి బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకొని, ఎవరినైనా ఇంప్రెస్ చేసి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ కొట్టేస్తాడేమో చూడాలి. షోలో తన డ్యాన్స్ లతో, తన ఆటతో ఆట సందీప్ ఎలా మెప్పిస్తాడో మరి.