Soniya : బిగ్ బాస్ సోనియా పెళ్లి.. కాబోయే వరుడు ఎవరంటే..? మూడేళ్ళుగా ప్రేమ.. పెళ్ళికి ముందే మాల్దీవ్స్‌కి..

తాజాగా సోనియా బాయ్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో వీరి ప్రేమ గురించి మరిన్ని విషయాలు తెలిసాయి.

Soniya : బిగ్ బాస్ సోనియా పెళ్లి.. కాబోయే వరుడు ఎవరంటే..? మూడేళ్ళుగా ప్రేమ.. పెళ్ళికి ముందే మాల్దీవ్స్‌కి..

Bigg Boss Soniya Akula Marriage fixed with her Boyfriend Details Here

Updated On : October 17, 2024 / 4:35 PM IST

Bigg Boss Soniya : ఇటీవల బిగ్ బాస్ లోకి నటి సోనియా వచ్చి నాలుగు వారాలకే ఎలిమినేట్ అయింది. ఆర్జీవీ కాంపౌండ్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది సోనియా. ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆశ, కరోనా లాంటి పలు సినిమాల్లో నటించింది. అయితే నటిగానే కాకుండా తాను ఓ టూరిజం సంస్థలో పనిచేస్తుంది. ఓ ఎన్జీవో కూడా నడిపిస్తుంది.

బిగ్ బాస్ లో ఉన్నప్పుడే సోనియా.. మూడేళ్ళుగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాము అని తన ప్రేమ గురించి చెప్పింది. తాజాగా సోనియా బాయ్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో వీరి ప్రేమ గురించి మరిన్ని విషయాలు తెలిసాయి. సోనియా బాయ్ ఫ్రెండ్ పేరు యష్ వీరగోని. ఇతనికి ఫ్లై హై అనే టూరిజం సంస్థ ఉంది. అలాగే అబ్రాడ్ కి వెళ్లే స్టూడెంట్స్ కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ ఉంది.

Also Read : Sobhan Babu : వాట్.. శోభన్ బాబు ఫ్యామిలీ సినీ పరిశ్రమలో ఉన్నారా..? ఆయన మా పెదనాన్న అంటూ..

తాజాగా సోనియా బయటకు వచ్చాక యష్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ.. సోనియా నా సంస్థలో పనిచేస్తుంది. రెండు, మూడేళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం. అక్కడే పరిచయం అయి ప్రేమించుకున్నాం. ఇంట్లో కూడా పెళ్ళికి ఓకే అన్నారు. బిగ్ బాస్ కి వెళ్లేముందే చేసుకోవాలని అనుకున్నాము కానీ బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో వదులుకోకూడదని సోనియా వెళ్ళింది. డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాము అని తెలిపాడు. దీంతో సోనియా ఫ్యాన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ ఈ జంటకు ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నారు.

View this post on Instagram

A post shared by Yash Veeragoni (@yashveeragoni)

తాజాగా సోనియా తన బాయ్ ఫ్రెండ్ యష్ తో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళింది. మాల్దీవ్స్ కి వెళ్తున్నట్టు సోనియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి యష్ ని ట్యాగ్ చేసింది.