తెలుగులో ‘విజిల్’ పేరుతో ‘బిగిల్’

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 12:37 PM IST
తెలుగులో ‘విజిల్’ పేరుతో ‘బిగిల్’

Updated On : October 7, 2019 / 12:37 PM IST

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది..

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘బిగిల్’..  ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. స్పోర్ట్స్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. నయనతార హీరోయిన్.. విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  

‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది. 118 నిర్మాత మహేష్ కోనేరు ‘బిగిల్’ నిర్మాతలతో కలిసి తెలుగులో రిలీజ్ చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగు పోస్టర్ విడుదల చేశారు. తేరి (పోలీసోడు), మెర్సల్ (అదిరింది) తర్వాత విజయ్, అట్లీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఫిలింగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

తమిళ్, తెలుగులో దీపావళికి సినిమా విడుదల కానుంది. సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : అర్చన కల్పతి, నిర్మాతలు : కల్పతి ఎస్.అఘోరం, కల్పతి ఎస్.గణేష్, కల్పతి ఎస్.సురేష్.
Image