Ram Setu : బాలీవుడ్ కి మరో తలనొప్పి.. అక్షయ్ కుమార్ రామ్‌సేతు సినిమాకి లీగల్ నోటిస్ పంపిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
అసలే బాలీవుడ్ వరుస ఫ్లాపులతో, బాయ్ కాట్ బాలీవుడ్ వివాదంతో కష్టాల్లో ఉంటే ఇప్పుడు మరో తలనొప్పి తయారైంది. తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న రామ్ సేతు సినిమా యూనిట్ కు సుబ్రహ్మణ్య స్వామి లీగల్ నోటిస్...........

BJP Leader Leagel notices to Ram Setu Movie Team
Ram Setu : అక్షయ్ కుమార్ హీరోగా నుష్రత్ బరుచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ముఖ్యపాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రామ్ సేతు అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఈ సినిమా. అక్టోబర్ చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
అసలే బాలీవుడ్ వరుస ఫ్లాపులతో, బాయ్ కాట్ బాలీవుడ్ వివాదంతో కష్టాల్లో ఉంటే ఇప్పుడు మరో తలనొప్పి తయారైంది. తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న రామ్ సేతు సినిమా యూనిట్ కు సుబ్రహ్మణ్య స్వామి లీగల్ నోటిస్ పంపించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో ప్రకటించారు సుబ్రహ్మణ్య స్వామి. బాలీవుడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో పాటు ఆ సినిమాకి సంబంధించిన మరో 8మందికి కూడా లీగల్ నోటిస్ జారీ చేశారు.
Karthikeya 2 : బాలీవుడ్ టాప్ 10 లో కార్తికేయ 2.. సరికొత్త రికార్డ్ సృష్టించిన నిఖిల్..
రామ్ సేతు సినిమాలో వాస్తవాలను వక్రీకరించి సినిమా తీస్తున్నారని, రామ్ సేతును కాపాడాలి. స్క్రిప్ట్, సినిమాను చూపించిన తర్వాతే రిలీజ్ చేయాలి అని నోటీసులో పేర్కొన్నారు సుబ్రహ్మణ్య స్వామి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Watch Dr #SubramanianSwamy Interview to News India on #RamSetu Movie & Tamil Nadu Temples Issue @Swamy39 @jagdishshetty https://t.co/r5iI5E20h6
— Tejas (@NAVANGULTEJAS) August 30, 2022