Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’లో బాలీవుడ్ హీరో.. ఎవరంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను నెక్ట్స్ లెవెల్‌లో తీర్చిదిద్దేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో నటిస్తున్నాడనే వార్త తెరపైకి వచ్చింది.

Bollywood Actor Bobby Deol In Pawan Kalyan Hari Hara Veeramallu
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్రను నెక్ట్స్ లెవెల్‌లో తీర్చిదిద్దేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ వీడియోలు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
Hari Hara Veera Mallu: వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేది ఆరోజే..?
ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఓ బాలీవుడ్ హీరో పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడని.. ఆయన చేయబోయేది ఓ కీలక పాత్ర అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వార్తతో బాబీ డియోల్ పవన్ కల్యాణ్ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Hari Hara Veera Mallu: వీరమల్లు కొత్త పోస్టర్.. ఫెరోషియస్ లుక్‌లో పవన్ అదుర్స్!
క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నిర్మాత ఏఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.