Hari Hara Veera Mallu: వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేది ఆరోజే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవగా, ప్రస్తుతం తమ నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Hari Hara Veera Mallu: వీరమల్లు షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేది ఆరోజే..?

Hari Hara Veera Mallu Shooting To Resume From This Date

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవగా, ప్రస్తుతం తమ నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Hari Hara Veera Mallu: వీరమల్లు కొత్త పోస్టర్.. ఫెరోషియస్ లుక్‌లో పవన్ అదుర్స్!

అయితే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను అక్టోబర్ 17 నుంచి నిర్విరామంగా చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Hari Hara Veera Mallu: పవర్ గ్లాన్స్‌కు టైం ఫిక్స్ చేసిన వీరమల్లు.. ఎప్పుడంటే?

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి నిజంగానే వీరమల్లు నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అందాల భమాలను నిధి అగర్వాల్, నోరా ఫతేహి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటంతో హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.