చైనా మార్కెట్ నుంచి బయటపడుతున్న బాలీవుడ్

యాంటీ చైనా సెంటిమెంట్‌తో ఇండియన్ సినిమా చైనా మార్కెట్ నుంచి బయటపడనుంది. సినిమా బిజినెస్ చేసుకోవడాన్ని పక్కకుబెట్టి అక్కడి ప్రాంతంలో రిలీజ్ చేయకూడదని అనుకుంటున్నారు. ‘కొవిడ్-19 కారణంగా చైనా మార్కెట్ తో సహా అన్ని మార్కెట్లు స్తంభించిపోయాయి. నాకు తెలిసి ఎటువంటి ప్రొడక్షన్ హౌజ్ నుంచి పరిస్థితులు మెరుగయ్యేంత వరకూ ఎలాంటి సినిమా రిలీజ్ అవదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చైనాలో ఏ సినిమా రిలీజ్ అవకుండా నిర్మాతలు గట్టిర నిర్ణయమే తీసుకుంటున్నారు’ అని ఓ ప్రొడ్యూసర్ అంటున్నారు.
అక్షయ్ రాతి అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ సంవత్సరానికి చైనా ఎలాగూ సంవత్సరానికి మూడు లేదా నాలుగు సినిమాలకు మించి అనుమతించబోదని అన్నారు. దానిని అలా వదిలేస్తామని రతి అన్నారు. చైనాలో బాలీవుడ్ సక్సెస్ అయిన స్టోరీ దశాబ్దాని కంటే ముందు అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ రూ.16కోట్లు వసూలు చేస్తే.. PK ( రూ.123 కోట్లు), Dangal ( రూ.1,200 కోట్లు), Secret Superstar ( రూ.700 కోట్లు). Hindi Medium ( రూ.300 కోట్లు), Andhadhun ( రూ.324 కోట్లు) వసూలు చేశాయి.
ఇండస్ట్రీ నిపుణుల నుంచి ఇండియన్ సినిమాలు చైనాలో కోట్లు కొల్లగొట్టగలవనే ధీమాతో ఉన్నారు. దేశంలోని స్క్రీన్లు ఐదేళ్లలో 10వేలకు పైగా పెరిగిపోయాయి. టిక్కెట్ రేట్లలోనూ అంతే తేడాలు కనిపిస్తున్నాయి. చైనాలో యావరేజ్ టిక్కెట్ రేటు 12డాలర్లుగా ఉంది. అదే ఇండియాలో ధర 1.5డాలర్లు. ఇండియా స్ట్రాంగ్ ఎమోషనల్ రిలేషన్స్ చైనా ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. సల్మాన్ ఖాన్ తనకు సంబంధం లేని ఓ చిన్నారిని పాకిస్తాన్ చేర్చే కథతో రెడీ అయిన భజరంగ్ భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో ఓ యువతి సింగర్ గా పోరాడిన స్టోరీ సూపర్ హిట్ అయ్యాయి.
చైనా మార్కెట్ లో ఇండియన్ సినిమాలు కొంచెంకొంచెంగా మార్కెట్ కోల్పోతున్నాయి. అక్షయ్ కుమార్ బయోలాజికల్ డ్రామా ప్యాడ్ మాన్ కలెక్షన్ కేవలం రూ.25.54కోట్లు మాత్రమే. మరో కామెడీ డ్రామా 102కు కలెక్షన్ రూ.25.06కోట్లు మాత్రమే. ఇండియన్ బ్లాక్ బ్లాస్టర్ సినిమా బాహుబలి 2 కూడా రూ.80కోట్లకు మించి వసూలు చేయలేకపోయింది. యూఎస్, యూకే, వెస్ట్ ఆసియాలతో పోలిస్తే బాలీవుడ్ కు చైనా మార్కెట్ ప్రమాదకరంగా తయారైంది.