ఇస్మార్ట్ శంక‌ర్ ‘బోనాలు’ వీడియో సాంగ్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 05:58 AM IST
ఇస్మార్ట్ శంక‌ర్ ‘బోనాలు’ వీడియో సాంగ్ రిలీజ్

Updated On : October 2, 2019 / 5:58 AM IST

పూరీ జ‌గన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్‌ ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా పూరీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా సెప్టెంబ‌ర్ 27,28,29 తేదీల‌లో మూవీని రీ రిలీజ్ చేశారు.

అయితే కొద్ది రోజులగా మూవీకి సంబంధించిన వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా బోనాలు సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ను  రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. ఇందులో రామ్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు రామ్ కు పోటిగా నభా నటేష్‌ కూడా స్టెప్పులతో అదరగొట్టింది. 

ఇక ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ తన 18వ సినిమాను దసరా లోగ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం జిమ్ లో రామ్ చేసే వర్కవుట్స్ మామూలుగా లేవు. ఈ సినిమా తమిళ రీమేక్ గా రూపొందనున్నట్లు సమాచారం.