Book My Show : దిల్‌రాజుకి తలొగ్గిన ‘బుక్ మై షో’.. నైజాంలో ‘భీమ్లా నాయక్’ టికెట్స్ బుకింగ్ షురూ..
బుక్ మై షో సర్వీస్ చార్జెస్ అంటూ ఎక్కువగా వసూలు చేయడంతో నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ , రానా నటించిన 'భీమ్లా నాయక్'.....

Dil Raju
Book My Show : గతంలో సినిమా టికెట్స్ కొనాలంటే థియేటర్స్ కి వెళ్లి లైన్ లో నిలబడి కొనేవాళ్ళం. ఇక ఫస్ట్ డే అయితే థియేటర్స్ వద్ద రచ్చ రచ్చ జరిగేది. కానీ ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ వచ్చాక ఈ పద్ధతి మారింది. బుక్ మై షో వచ్చాక ఎక్కడున్నా చేతిలో ఫోన్ అందులో నెట్ ఉంటే చాలు మనకి కావాల్సిన థియేటర్ లో కావాల్సిన సినిమా టికెట్ కావలసినప్పుడు బుక్ చేసుకోవచ్చు. దీంతో అంతా దీనికి అలవాటు పడ్డారు.
అయితే మొదట్లో సర్వీస్ చార్జెస్, ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జెస్ అంటూ టికెట్ రేటు పైన ఇంకొంచెం వసూలు చేసేవారు. చేసేది. అయితే ఇటీవల ఈ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తుంది. దాదాపు 11 శాతం వరకు వసూలు చేస్తుంది. అంటే దాదాపు 100కి 11 రూపాయలు వసూలు చేస్తుంది. కరోనా వల్ల అసలే థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదు. అసలు రేటుకి ఈ సర్వీస్ చార్జీలు ఎక్కువ ఉండటంతో టికెట్ రేట్ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు.
ఇలా బుక్ మై షో సర్వీస్ చార్జెస్ అంటూ ఎక్కువగా వసూలు చేయడంతో నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ , రానా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా టికెట్లని బుక్ మై షోలో అమ్మకూడదని, డైరెక్ట్ గా థియేటర్స్ లోనే అమ్మాలని నిర్ణయించారు. దీంతో అంతా నైజాంలో టికెట్స్ థియేటర్ కి వెళ్లి కొనుక్కోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు.
Bheemla Nayak : తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్
ఇదే కనుక జరిగితే ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి బుక్ మై షో లాభాల్లో భారీ గండి పడే అవకాశం ఉంది. దీంతో బుక్ మై షో దిల్ రాజుతో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలించి దిల్ రాజు చెప్పిన డిమాండ్స్ కి బుక్ మై షో ఒప్పుకుంది. సర్వీస్ చార్జెస్ థియేటర్ రేంజ్ ని బట్టి కేవలం 5 నుంచి 6 శాతం వరకే పెడతామని బుక్ మై షో తెలిపింది. బుక్ మై షో తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఆన్లైన్ లో బుక్ చేసుకునే వారికి టికెట్ రేట్లు కాస్తో కూస్తో తగ్గనున్నాయి.
Abhiram : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ
ఇక భీమ్లా నాయక్ సినిమాకి నైజాంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశామని, టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ బుక్ మై షో తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా పోస్ట్ చేసిన కొన్ని క్షణాలకే భీమ్లా నాయక్ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
Get your tickets here: https://t.co/CPN9f49a3d
— BookMyShow (@bookmyshow) February 22, 2022