Boyapati Sreenu : అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. వర్క్ జరుగుతుంది..
నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో అభిమానులంతా అఖండ 2 సినిమా గురించి అడగడంతో

Boyapati Srinu gives clarity on Balakrishna Akhanda sequel Movie in Skanda Pre Release Event
Boyapati Sreenu : బాలకృష్ణ(Balakrishna) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అఖండ(Akhanda) ఒకటి. అలాగే బాలకృష్ణకు మొదటి 100 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన సినిమా అఖండ. బోయపాటి – బాలయ్య కాంబోలో వచ్చిన మూడో సినిమా కాగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా బోయపాటి మరోసారి అఖండ సీక్వెల్ గురించి మాట్లాడారు.
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రం స్కంద. శ్రీలీల (Sreeleela), సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Skanda Trailer : స్కంద ట్రైలర్.. అదరగొట్టిన రామ్.. మాస్ ఆడియన్స్కి పుల్ మీల్స్
ఈ ఈవెంట్ లో అభిమానులంతా అఖండ 2 సినిమా గురించి అడగడంతో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ 2 కచ్చితంగా ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. కొద్దిగా లేట్ అయినా అఖండ 2 సినిమా ఉంటుంది అని అన్నారు. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. మరి స్కంద సినిమా రిలీజ్ తర్వాతే బోయపాటి అఖండ 2 మొదలుపెడతారా? లేక అల్లు అర్జున్ తో ఉన్న సినిమా తర్వాత తీస్తారా చూడాలి.