Akhanda 2 : ‘అఖండ 2’ వర్క్ మొదలైంది.. లీక్ చేసిన అఖండ కాస్ట్యూమ్ డిజైనర్..

అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలోనే ప్రకటించారు.

Akhanda 2 : ‘అఖండ 2’ వర్క్ మొదలైంది.. లీక్ చేసిన అఖండ కాస్ట్యూమ్ డిజైనర్..

Boyapati Srinu Balakrishna Akhanda 2 Works Started Costume Designer Raamz Leaked News

Akhanda 2 : బోయపాటి – బాలయ్య బాబు కాంబో అంటే ఏ రేంజ్ హిట్స్ పడతాయో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానికి మించి ఒకటి భారీ హిట్ అయ్యాయి. అఖండ సినిమాలో అఘోరా లుక్ లో బాలయ్య బాబు అదరగొట్టారు. అఖండగా బాలయ్య చేసిన మాస్ యాక్షన్ సీన్స్ అయితే థియేటర్స్ లో దద్దరిల్లిపోయాయి. 2021లో వచ్చిన అఖండ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది.

అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి(Boyapati Srinu) గతంలోనే ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడు మళ్ళీ బోయపాటి – బాలయ్య బాబు(Balakrishna) కాంబోలో అఖండ 2 సినిమా వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2 స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖండ సినిమాలో బాలయ్య అఘోరా లుక్ కి కూడా బాగా ప్రశంసలు వచ్చాయి. ఆ లుక్ డిజైన్ చేసింది కాస్ట్యూమ్ డిజైనర్ రామ్స్.

Also Read : Tillu Square Twitter Review : ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. డీజే టిల్లు మళ్ళీ హంగామా చేశాడా? ప్రేక్షకులు ఏమంటున్నారు?

కాస్ట్యూమ్ డిజైనర్ రామ్స్(Raamz) ప్రస్తుతం హీరోగా ఫైటర్ రాజా అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఫైటర్ రాజా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో రామ్స్ అఖండ 2 గురించి ప్రస్తావించాడు. రామ్స్ మాట్లాడుతూ.. అఖండ సినిమాలో బాలకృష్ణ సర్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. నేను, బోయపాటి గారు కలిసి ఆ డ్రెస్, చైన్స్, మొత్తం లుక్ రెడీ చేసాము. ఇటీవలే బోయపాటి గారు మాట్లాడారు. అఖండ 2 సినిమా కోసం పనిచేస్తున్నాను. త్వరలోనే వర్క్ మొదలవుతుంది. ఈ సారి బాలయ్య లుక్ మరింత అదిరిపోతుంది. నేను నటిస్తూనే మరో పక్క కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతాను అని తెలిపాడు.

Also Read : Sharwanand : బాలయ్య బాబు టైటిల్‌తో శర్వానంద్ సినిమా.. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే..

అఖండ 2 వర్క్ మొదలైందని చెప్పడంతో బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో అఖండ 2 మొదలయి వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ్ అవుతుందని టాలీవుడ్ సమాచారం. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంబో మరోసారి తమ హిట్స్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. నిన్న రాత్రే లెజెండ్ పదేళ్ల వేడుక జరగగా బాలయ్య, బోయపాటి ఇద్దరూ వచ్చారు. బోయపాటి మరోసారి బాలయ్యతో పనిచేస్తాను అని క్లారిటీ కూడా ఇచ్చారు.