కారును ఢీకొట్డాడని చేయి చేసుకున్న నటుడు మహేశ్ మంజ్రేకర్!

కారును ఢీకొట్డాడని చేయి చేసుకున్న నటుడు మహేశ్ మంజ్రేకర్!

Updated On : January 18, 2021 / 4:21 PM IST

Case filed against Mahesh Manjrekar : బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు ఇతర భాషా చిత్రాల్లో నటించిన మహేశ్ మంజ్రేకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును ఢీకొనడంతో తనపై చేయి చేసుకున్నాడని, అంతేగాకుండా..అసభ్యపదజాలంతో దూషించాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పూణే గ్రామీణ పరిధిలో Yawat police station పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…

మహేశ్ మంజ్రేకర్ శనివారం రాత్రి కారులో పూణె నుంచి షోలాపూర్ వెళుతున్నారు. మార్గమధ్యంలో కారు సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనుకన ఉన్న మరోకారు మహేశ్ మంజ్రేకర్ ను ఢీకొంది. దీంతో..కారులో నుంచి దిగిన మహేశ్ తనతో వాగ్వాదానికి దిగారని, అంతేగాకుండా..చేయి చేసుకున్నాడని Kailas Satpute అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బండబూతులు తిట్టాడని వెల్లడించారు.

అతని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మహేశ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని మహేశ్ ఆరోపించారు. కారును ఢీకొన్న తర్వాత..కనీసం సారీ చెప్పడానికి కూడా అతను కిందదిగలేదన్నారు. ఇక మహేశ్ మంజ్రేకర్ విషయానికి వస్తే..నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక్కడున్నాడు, హోమం, అదుర్స్ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.