బెల్లంకొండ సినిమాకు నటీనటులు కావలెను: అమెరికాలో కూడా!

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా బీటెల్ లీఫ్ ప్రొడక్షన్, లక్కీ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
సావిత్రి సినిమా దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి ప్రేమ కథా చిత్రం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు డైలాగ్స్ అందించగా.. రాధన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.
ఈ సినిమాకు 15ఏళ్ల నుంచి 25ఏళ్ల ఏళ్ల మధ్య వయసున్న నటీనటులు కావాలని యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. నటనపై ఆసక్తి ఉండేవారు పోర్ట్‌ఫోలియోలను castingcallp10@gmail.com కి మెయిల్ పంపాలని యూనిట్ కోరుతుంది.
అలాగే అమెరికాలో ఉంటూ టాలెంట్ కలిగి ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది చిత్రబృందం. జనవరిలో ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరగనుంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న తెలుగు వారిని ఆడిషన్స్‌కు ఆహ్వానించింది చిత్రబృందం.