దైవం మనుష్య రూపేణా.. సోనూసూద్‌కు శుభాకాంక్షల వెల్లువ..

ఒక వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లు.. ఇలా ‘రియల్ హీరో, దైవం మనుష్య రూపేణా’.. అంటూ సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వివిధ భాషల, ప్రాంతాలవారు ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అలాగని అతనేం రాజకీయ నాయకుడు కాదు.. స్టార్ హీరో కూడా కాదు. అయినా సరే.. ఒక విపత్తు సంభవించినప్పుడు నిజమైన హీరో, నిజమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన చొరవ ఏమిటో తన చేతలతో చూపించాడు. రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా? వెండితెరపై విలన్‌గా పరిచయమున్న సోనూసూద్. ఆయన రీల్ లైఫ్‌లో కానీ.. రియల్ లైఫ్‌లోమాత్రం గొప్ప మనసు ఉన్న ఓ శిఖరం.
సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్.. ఇంకా ఏ మ్యాన్ ఉంటే వాళ్లు.. ఎవరూ సోనూసూద్‌కు సరిపోరు. ఇది సోషల్ మీడియాలో ఆయన నుంచి సాయం పొందిన వారు, ఆయన చేసిన సాయం చూసిన వారు చెబుతున్న మాట. ఈరోజు (గురువారం) ఆయన పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన బాలీవుడ్ నటుడే అయినా యావత్ సినీ ప్రపంచాన్ని ఈరోజు తల ఎత్తుకునేలా చేశాడు సోనూసూద్.
‘కరోనా సమయంలో రియల్ హీరోలా సేవ చేస్తున్నారు. సోనూ సూద్ చేసే ప్రతిపనిలో దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా..’ అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేస్తే.. ‘మీరు మాలో ఇలా స్ఫూర్తి నింపుతూనే ఉండాలి.. అలాగే ఈ ప్రపంచానికి ఏ విధంగానైనా అవధులులేని సంతోషాన్ని అందిస్తుండాలి సోనూ భాయ్’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.
Many More Happy returns Sonu Bhai….. @SonuSood may u continue to inspire us May God bless you with unlimited happiness which anyways u share with the world?? https://t.co/RTgB33V24r
— Harish Shankar .S (@harish2you) July 30, 2020
‘మహాత్మా సోనూ.. గవర్నమెంట్ మీకు పద్మభూషణ్ ఇవ్వాలి..’ అని నటుడు బ్రహ్మాజీ ట్వీజ్ చేస్తే.., ‘సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్‌ల కంటే గొప్పవాడు. మానవతావాది. ఆయనను పుట్టించినందుకు దేవుడికి ధన్యవాదాలు.. లాంగ్ లీవ్..’ అని కోన వెంకట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇంకా హీరో రామ్, కాజల్ అగర్వాల్, డైరెక్టర్ బాబీ వంటి సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఎందరో సోనూసూద్‌కు శుభాకాంక్షలు చెప్పినవారిలో ఉన్నారు. అలాగే పలువురు హీరోల అభిమానులు కూడా సోనూసూద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతున్నారు.