మాల్దీవ్స్.. కేరాఫ్ స్టార్స్..

  • Published By: sekhar ,Published On : November 23, 2020 / 08:47 PM IST
మాల్దీవ్స్.. కేరాఫ్ స్టార్స్..

Updated On : November 24, 2020 / 12:05 PM IST

Celebrity Maldives Vacation: ఇన్నాళ్లు లాక్‌డౌన్‌‌తో ఇళ్లల్లోనే లాక్ అయిపోయిన స్టార్లు .. ఇప్పుడు రెక్కలు విప్పిన పక్షుల్లా బయటపడుతున్నారు. ఒక వైపు పెండింగ్ ప్రాజెక్ట్స్‌ని లాంగ్ షెడ్యూల్స్‌తో కంప్లీట్ చేస్తూనే.. మరో వైపు వర్క్ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతున్నారు. ఒకరిద్దరు కాదు.. స్టార్లు అందరూ టెన్షన్ మర్చిపోయి మాంచి మూడ్‌లో చిల్ అయ్యే ప్లేస్ ఏదో తెలుసా..?


లాక్ డౌన్ తర్వాత ఇప్పడిప్పుడే బయటికొస్తున్న స్టార్లు అందరూ కలిసి ఫారెన్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోటకి వెళ్లడం కాదు, అందరూ కలిసి ఒకే చోటికి చేరుతున్నారు. మాల్దీవ్స్.. ఇక్కడ స్టార్లు ఉండబడును అనేలా టెన్షన్ మర్చిపోయి మాంచిమూడ్‌లో చిల్ అవుతున్నారు.

ఇటీవలే కాజల్ కూడా గౌతమ్ కిచ్లుని పెళ్లిచేసుకున్న కాజల్ అగర్వాల్ హనీమూన్‌కి మాల్దీవ్స్ వెళ్లింది. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

లేటెస్ట్‌గా సమంత, నాగ చైతన్య కూడా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు.నాగ చైతన్య బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సమంత స్కూబా డైవింగ్ కూడా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాల్దీవ్స్‌లోనే మకాం వేసింది. రకుల్ ఫ్యామిలీతో సహా మాల్దీవ్స్ వెళ్లి అక్కడ అందాల్ని ఎంజాయ్ చేస్తోంది. 2 పీస్ బికినీతో రకరకాల లొకేషన్స్‌లో ఫోటోలకి ఫోజులిస్తోంది. అంతేకాదు అండర్ వాటర్‌లో స్కూబా డైవింగ్ విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pranitha Subhash ? (@pranitha.insta)

కన్నడ చిన్నది ప్రణీత సుభాష్ కూడా మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి లొకేషన్స్‌లో హ్యాపీగా చిల్ అవుతోంది. దీనికి సంబందించి మూమెంట్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN ?? (@mehreenpirzadaa)

ఇక మెహరీన్ కూడా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మాల్దీవ్స్‌లోనే చేసుకుంది. ఇలాంటి బర్త్‌డేని ఇంతకుముందెప్పుడూ చేసుకోలేదని డెస్టినేషన్ బర్త్‌డే ని కావాలని మరీ మాల్దీవ్స్‌లో ప్లాన్ చేసుకుంది మెహరీన్.

 

View this post on Instagram

 

A post shared by Shanvi sri (@shanvisri)

రౌడీ హీరోయిన్ శాన్వీ కూడా తన మాల్దీవ్స్ ట్రిప్ వేసింది. బీచ్‌లో బికినీతో ఫొటోలు తీసుకుని వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ కూడా అక్కడే చిల్ అవుతోంది. హాట్ హాట్ ఫోటోస్‌తో మాల్దీవ్స్‌లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని కూడా చూపిస్తోంది. ఇలా స్టార్లందరూ హాలీడే ట్రిప్ ఎంజాయ్ చెయ్యడం కోసం కేరాఫ్ మాల్దీవ్స్‌గా మారిపోయారు.