Breath Movie : నందమూరి కుటుంబంలో మరో హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్..

నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీకి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న పరిచయం అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా పరిచయం అవ్వబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ

Breath Movie : నందమూరి కుటుంబంలో మరో హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్..

chaitanya krishna launch from nandamuri family, movie first look launch by kalyan ram

Updated On : March 5, 2023 / 6:44 PM IST

Breath Movie : నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీకి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న పరిచయం అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా పరిచయం అవ్వబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ ఈ ఏడాది హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. తాజాగా నేడు (మార్చి 5) ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ అధికారికంగా సినిమాని అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ ని కళ్యాణ్ రామ్ చేతులు మీదగా రిలీజ్ చేశారు.
Balakrishna – NTR : బాలయ్య నిజంగానే ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నాడా.. రామ్‌చరణ్ చెప్పిన నిజమేంటి?

ఈ సినిమాకి ‘బ్రీత్’ అనే టైటిల్ ని ఖరారు చేయగా.. అంతిమ పోరాటం అనే పవర్ ట్యాగ్ లైన్ ని పెట్టారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా.. పోస్టర్ లో చైతన్య కృష్ణ వర్షంలో గొడుగు పట్టుకొని, చెవిలో బ్లూటూత్ పెట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘పోస్టర్ చూస్తుంటే చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాతో నిర్మాతగా మా పెదనాన్న, హీరోగా మా అన్నయ్య సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ వెల్లడించాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని నందమూరి జయకృష్ణ బసవతారకం క్రియేషన్స్ పతాకం పై మొదటి ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు జగపతిబాబు హీరోగా ‘రక్షా’ అనే మిస్టిక్ థ్రిల్లర్ ని తెరకెక్కించాడు. కాగా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము అంటూ మేకర్స్ తెలియయజేశారు. మరి నందమూరి కుటుంబం నుంచి ఎంట్రీ ఇస్తున్న ఈ హీరో సక్సెస్ అవ్వగలడా? లేదా? చూడాలి.