Barabar Premistha Song : రెడ్డి మామ.. అంటున్న యాటిట్యూడ్ స్టార్.. ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి సాంగ్ రిలీజ్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మాస్ సాంగ్ ని నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.

Barabar Premistha Song : రెడ్డి మామ.. అంటున్న యాటిట్యూడ్ స్టార్.. ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి సాంగ్ రిలీజ్..

Chandrahass Barabar Premistha Movie Song Released by Dilraj

Updated On : February 22, 2025 / 7:58 PM IST

Barabar Premistha Song : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ త్వరలో ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమాతో రాబోతున్నాడు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాణంలో సంపత్ రుద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తుండగా, అర్జున్ మహీ విలన్ గా, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Anaganaga Teaser : మళ్ళీ వస్తున్న సుమంత్.. ‘అనగనగా’ టీజర్.. తెలుగు భాష ప్రేమికులు చూడాల్సిందే..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మాస్ సాంగ్ ని నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘ ఏం పిల్లను కన్నావు రెడ్డి మామ..’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ని సురేష్ గంగుల రాయగా RR ధృవం సంగీత దర్శకత్వంలో నకాష్ అజిజ్, సాహితి చాగంటి పాడారు. మీరు కూడా ఈ మాస్ బీట్ సాంగ్ వినేయండి..

https://www.youtube.com/watch?v=6ii9vh4f5Fo

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Chandrahass Barabar Premistha Movie Song Released by Dilraj