Chethabadi : రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా.. బాణామతి బ్యాక్ డ్రాప్ లో ‘చేతబడి’ సినిమా..
నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ సినిమా గురించి, కథ ఆధారం గురించి తెలిపారు.

Chethabadi
Chethabadi : శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్ పై నంద కిషోర్ నిర్మాణంలో సూర్యాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చేతబడి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ సినిమా గురించి, కథ ఆధారం గురించి తెలిపారు.
డైరెక్టర్ సూర్యాస్ మీడియాతో మాట్లాడుతూ.. చేతబడి అనేది 16వ శతాబ్దంలో ఇండియాలో పుట్టిన ఒక కల. చేతబడి ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్ గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశాము. కొన్ని రకాలుగా బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం అని తెలిపారు.
Also Read : Mayasabha : ‘మయసభ’ ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా.. ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..
నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకున్న వారి గురించి ఈ చేతబడి సినిమాలో రియలిస్టిక్ గా చూపించబోతున్నాం అని అన్నారు.
Also Read : Kingdom : కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే..?