Bhola Shankar: భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్.. సంబరాలకు మెగా ఫ్యాన్స్ రెడీ

ఒక డిస్ట్రిబ్యూటర్ 30 కోట్ల రూపాయలు పోగొట్టుకుని రోడ్ మీద ఉన్నాడని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు.

Bhola Shankar: భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్.. సంబరాలకు మెగా ఫ్యాన్స్ రెడీ

Chiranjeevi Bhola Shankar

Updated On : August 10, 2023 / 7:47 PM IST

Bhola Shankar -Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా నిర్మాతలు తనను మోసం చేశారని చెబుతూ ఆయన పిటిషన్ వేశారు. అఖిల్ నటించిన ఓ సినిమా విషయంలో ఈ సినిమా నిర్మాతలు తనను మోసం చేశారని వివరించారు. తనకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ.30 కోట్లు ఇవ్వాలని చెప్పారు. పిటిషన్ స్వీకరణకు సంబంధించి సివిల్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్ ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

డిస్ట్రిబ్యూటర్లకు చీకటి రోజు: నట్టి కుమార్
ఇది డిస్ట్రిబ్యూటర్లకు చీకటి రోజని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్ 30 కోట్ల రూపాయలు పోగొట్టుకుని రోడ్డు మీద ఉన్నాడని చెప్పారు. సినిమా పెద్దలు చొరవ తీసుకోవాలని కోరారు. సిటీ సివిల్ కోర్టు తీర్పుపై హై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

కొందరి లగ్జరీ, ఎంజాయిమెంట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు బలి అవుతున్నారని అన్నారు. తమ డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేస్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమస్యలు పట్టించుకుంటే తాము కోర్టులకు ఎందుకు వస్తామని నిలదీశారు.

Bholaa Shankar: చిరంజీవి భోళా శంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్