Chiranjeevi : అవన్నీ అవాస్తవాలు.. నేనెవరినీ కలవలేదు.. ఫిలిం ఫెడరేషన్ మీటింగ్‌పై చిరంజీవి క్లారిటీ

సినీ కార్మికుల వేతనాల పెంపుపై తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు.

Chiranjeevi : అవన్నీ అవాస్తవాలు.. నేనెవరినీ కలవలేదు.. ఫిలిం ఫెడరేషన్ మీటింగ్‌పై చిరంజీవి క్లారిటీ

Chiranjeevi

Updated On : August 9, 2025 / 6:08 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 30శాతం వేతన పెంపు డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన సమ్మె కారణంగా టాలీవుడ్ షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పెంపు సాధ్యం అని నిర్మాత‌లు చెబుతున్నారు. కావాలంటే 15 శాతం పెంచ‌డానికి ట్రై చేస్తామ‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ లోని కొంద‌రు స‌భ్యులు చిరంజీవిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నార‌ని, సోమ‌వారం వ‌ర‌కు ఈ వేత‌నాల పెంపు స‌మ‌స్య తీర‌క‌పోతే త‌న సినిమాకు సోమ‌వారం నుంచి 30 శాతం వేత‌నాలు పెంచి ఇస్తామ‌ని చిరు హామీ ఇచ్చిన‌ట్లుగా కొన్ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Vadde Naveen : రీఎంట్రీ ఇస్తున్న ఒక‌ప్ప‌టి హీరో వ‌డ్డే న‌వీన్‌..

తాజాగా వీటిపై మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లు అని స్ప‌ష్టం చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి త‌న‌ను ఎవ‌రూ క‌ల‌వ‌లేద‌న్నారు.

” నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.

ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. నేనే కాదు, వ్య‌క్తిగ‌తంగా ఏ ఒక్క‌రు కూడా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్‌ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన, ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి.’ అని చిరంజీవి అన్నారు.